బంగ్లా తొలి బ్యాట్స్‌మెన్ చరిత్ర సృష్టించిన తమీమ్ ఇక్బాల్

హైదరాబాద్: బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన బంగ్లా తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. 2007 వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
దీంతో వన్డేల్లో బంగ్లాదేశ్ తరుపున వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన 83వ ఆటగాడిగా నిలిచాడు. సరిగ్గా ఏడాది తర్వాత 2008లో తమీమ్ ఇక్బాల్ తొలి సెంచరీ సాధించాడు. శ్రీలంక, జింబాబ్వేలతో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరిస్‌లో తమీత్ ఇక్బాల్ ఈ మైలురాయిని అందుకున్నాడు.
పదకొండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తమీమ్ ఇప్పటివరకు బంగ్లాదేశ్ తరుపున 177 మ్యాచ్‌ల్లో 35.65 సగటుతో 6010 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 41 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో తమీమ్ ఇక్బాల్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 154. షకీబ్ అల్ హసన్ 5235 పరుగులతో ఈ జాబితాలో తమీమ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో ఒక వేదికపై అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కూడా తమీమ్ పేరిట ఉంది. శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో అత్యధిక పరుగులు సాధించాడు. సనత్ జయసూర్య (2514) పేరిట ఉన్న రికార్డును తమీమ్ ఇక్బాల్ బద్దలు కొట్టాడు.
| Player | Span | Mat | Runs | Ave | 100 | 50 |
| Tamim Iqbal | 2007-2018 | 177* | 6010 | 35.35 | 9 | 41 |
| Shakib Al Hasan | 2006-2018 | 183* | 5235 | 35.13 | 7 | 37 |
| Mushfiqur Rahim | 2006-2018 | 182* | 4670 | 33.12 | 5 | 28 |
| Mohammad Ashraful | 2001-2013 | 175 | 3468 | 22.37 | 3 | 20 |
| Mahmudullah | 2007-2018 | 151* | 3244 | 33.79 | 3 | 17 |
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications