న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పార్టీ లేదు.. గీర్టీ లేదు.. మనం ఏం ప్రపంచకప్ గెలవలేదు.. క్లాస్ పీకిన రాహుల్ ద్రవిడ్!

T20 World Cup 2022: Rahul Dravid Cancels Team India Grand Diwali Dinner Party in Sydney

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని యావత్ దేశం సెలెబ్రేట్ చేసుకుంది. ప్రపంచకప్ గెలిచినంత సంబురపడింది. కానీ భారత జట్టు మాత్రం ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకోలేదు. కనీసం కేక్ కూడా కట్ చేయలేదు. పాకిస్థాన్‌పై సాధించిన విజయంతో పాటు దీపావళిని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయాలని భావించిన భారత దౌత్య అధికారులకు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని షాకిచ్చారు. సిడ్నీ వేదికగా గ్రాండ్ దివాళీ డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయగా.. చివరి నిమిషంలో రద్దు చేయించారు.

కోహ్లీ సూచనలతోనే..

కోహ్లీ సూచనలతోనే..

పాకిస్థాన్ విజయాన్ని ఏమాత్రం సెలెబ్రేట్ చేసుకోవద్దని, ప్రపంచకప్ గెలవడమే అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచకప్ గెలిచే వరకు పార్టీలకు దూరంగా ఉండాలని, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని ఆటగాళ్లకు సూచించారు. సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూచనల మేరకే రాహుల్ ద్రవిడ్ పార్టీని రద్దు చేశారని టీమిండియా సపోర్ట్ స్టాఫ్ మెంబర్ ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లకు కోచ్ ద్రవిడ్‌తో పాటు కెప్టెన్ రోహిత్ పలు సూచనలు చేశారని సదరు సభ్యుడు పేర్కొన్నాడు.

టైటిల్ గెలవడమే మన టార్గెట్..

టైటిల్ గెలవడమే మన టార్గెట్..

'ఏ మాత్రం దృష్టిని మరల్చకండి. మన అంతిమ లక్ష్యంపైనే ఫోకస్ పెట్టండి. ఈ విజయ ఉత్సహాన్ని ఇలానే కొనసాగిద్దాం. ఇది జట్టుకు లభించిన గొప్ప ఆరంభం మాత్రమే. ఆఖరి వరకు ఇదే జోరును కొనసాగిద్దాం. టోర్నీ అప్పుడే అయిపోలేదు. కాబట్టి మైదానంలో ఉండి లక్ష్యం కోసం శ్రమించండి'అని మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకు చెప్పారని సదరు సపోర్ట్ స్టాఫ్ మెంబర్ తెలిపాడు. సిడ్నీలోని ఇండియన్ కన్సులేట్ భారత జట్టుకు గ్రాండ్ దివాళీ డిన్నర్ ఇవ్వాలని భావించింది. సిడ్నీ సిటీలో కూడా దివాళీ వేడుకలు నిర్వహించారు. ది ఐకానిక్ సిడ్నీ ఓపెరా హౌస్ వెలుగులు జిమ్మించింది.

చిన్న చిన్న ఆనందాలు..

చిన్న చిన్న ఆనందాలు..

సీనియర్ ప్లేయర్ల సూచనలతో గ్రాండ్ దీపావళీ పార్టీని రద్దు చేశారు. పాక్‌తో విజయానంతరం భారత ఆటగాళ్ల ఫోన్స్‌కు సందేశాలు దండెత్తాయి. ఆటగాళ్లు సైతం తమ శ్రేయోభిలాషులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఎలాంటి కేక్ కట్టింగ్ కూడా చేయలేదు. మ్యాచ్ ముగిసిన వెంటనే చాలా మంది తమ గదుల్లోకి వెళ్లిపోయారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మాత్రం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మరుసటి ఉదయమే సిడ్నీకి బయల్దేరారు. సోమవారం పూర్తిగా రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత కొందరు జిమ్ చేయగా.. మరికొందరూ బయట సరదాగా తిరిగారు. అంతిమ లక్ష్యం కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న చిన్న వాటిని సెలెబ్రేట్ చేసుకోవడం సరికాదని, టీమ్ విధానాన్ని ఫాలో అవుదామని సీనియర్ ఆటగాళ్లు ప్లేయర్లకు తెలియజేశారు.

Story first published: Tuesday, October 25, 2022, 17:02 [IST]
Other articles published on Oct 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X