న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మోర్గాన్ విధ్వంసం: టీ20 బ్లాస్ట్ టోర్నీ చరిత్రలోనే ఛేజింగ్‌ రికార్డు నమోదు

T20 Blast: Eoin Morgan smashes 83* off 29 balls as Middlesex pull off record run chase against Somerset

హైదరాబాద్: ఇంగ్లాండ్‌కు చారిత్రాత్మక ప్రపంచకప్ విజయాన్ని అందించిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టీ20 బ్లాస్ట్‌లో మరోసారి విజృంభించాడు. టి20 బ్లాస్ట్‌లో భాగంగా మిడిల్‌సెక్స్‌ తరఫున ఆడుతున్న ఇయాన్ మోర్గాన్‌ శుక్రవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

యాషెస్ 2019: టూర్ మ్యాచ్‌లో విఫలం, 4వ టెస్టులో స్మిత్ ఆడతాడా?యాషెస్ 2019: టూర్ మ్యాచ్‌లో విఫలం, 4వ టెస్టులో స్మిత్ ఆడతాడా?

ఈ మ్యాచ్‌లో 29 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో అజేయంగా 83 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన సోమర్‌సెట్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 226 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ టామ్‌ బెల్‌ 47 బంతుల్లో 13 ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో 101 నాటౌట్‌ నిలిచాడు.

అనంతరం 227 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిల్‌సెక్స్‌కు ఓపెనర్లు డేవిడ్‌ మాలన్‌(41), పాల్‌ స్టిర్లింగ్‌(25)లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ జోడీ తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్‌(32) చెలరేగాడు. దీంతో తొమ్మిది ఓవర్లకు మిడిల్‌సెక్స్‌ మూడు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది.

కార్న్‌వాల్‌ అరంగేట్రం: చ‌రిత్ర పుటల్లోకి ఎక్కిన భారత్-విండిస్ రెండో టెస్టుకార్న్‌వాల్‌ అరంగేట్రం: చ‌రిత్ర పుటల్లోకి ఎక్కిన భారత్-విండిస్ రెండో టెస్టు

అనంతరం క్రీజులోకి వచ్చిన మోర్గాన్‌ వచ్చీ రావడంతోనే దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. మోర్గాన్‌ ధాటికి మిడిల్‌సెక్స్‌ 17 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఈ టోర్నీ చరిత్రలోనే ఛేజింగ్‌ రికార్డుగా నమోదైంది. 2014లో ససెక్స్‌ 226 పరుగుల టార్గెట్‌ను ఎసెక్స్‌పై సాధించింది. ఐదేళ్ల తర్వాత మిడిల్‌సెక్స్‌ ఆ రికార్డుని బద్దలు కొట్టింది.

Story first published: Saturday, August 31, 2019, 13:43 [IST]
Other articles published on Aug 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X