న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒలింపిక్స్‌కు టీ10 ఫార్మాట్ సరిగ్గా సూట్ అవుతుంది: అఫ్రిది

T10 Cricket is perfect for Olympics, says Shahid Afridi

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని ఎప్పటి నుంచో అంతర్జాతీయ వేదికపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది మాట్లాడుతూ టీ10 ఫార్మాట్‌ అయితే ఒలింపిక్స్‌కు చక్కగా సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

<strong>హాకీ వరల్డ్‌కప్: కెనడాతో మ్యాచ్ డ్రా, దక్షిణాఫ్రికా నాకౌట్ ఆశలు సజీవం</strong>హాకీ వరల్డ్‌కప్: కెనడాతో మ్యాచ్ డ్రా, దక్షిణాఫ్రికా నాకౌట్ ఆశలు సజీవం

ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న టీ10 లీగ్‌లో అఫ్రిది పాక్‌టూన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా అఫ్రిధి మాట్లాడుతూ "క్రికెట్‌ను ఒలింపిక్స్‌కు పరిచయం చేయడానికి ఇదే సరైన ఫార్మాట్‌. చాలా వేగంగా ముగిసే ఈ టీ10 మ్యాచ్‌.. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ల నైపుణ్యానికి పరీక్ష పెడుతుంది" అని అన్నాడు.

టీ10 లీగ్‌లో ప్రత్యక్షంగా చూశా

టీ10 లీగ్‌లో ప్రత్యక్షంగా చూశా

"గొప్ప ఇన్నింగ్స్‌లు, సరికొత్త స్కిల్స్‌, వైవిధ్యమైన షాట్లను ఈ లీగ్‌లో ప్రత్యక్షంగా చూశా. ఈ ఫార్మాట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ స్వరూపమే మారనుంది. దీని వల్ల టీ20, వన్డే ఫార్మాట్లు కూడా మారే అవకాశం ఉంది. తక్కువ సమయంలో ముగుస్తుంది కాబట్టి ఒలింపిక్స్‌కు ఇదే టీ10 లీగ్ నప్పుతుంది" అని అఫ్రిది అన్నాడు.

ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ

ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ

అఫ్రిది వ్యాఖ్యలతో ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ సైతం ఏకీభవించాడు. ఈ సందర్భంగా ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ "టీ20 మ్యాచ్‌ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ ఫార్మాట్‌తో ఒలింపిక్స్‌కు వెళితే ఆరు వారాల సమయం పడుతుంది. టీ10 ఫార్మాట్‌ అయితే ఎనిమిది రోజుల్లోనే ముగుస్తుంది" అని అన్నాడు.

2022లో బర్మింగ్‌హమ్‌ వేదికగా జరగనున్న

2022లో బర్మింగ్‌హమ్‌ వేదికగా జరగనున్న

1990 నుంచి ఒలింపిక్స్‌లో నిర్వాహకులు క్రికెట్‌ను నిర్వహించడం లేదు. తాజాగా 2022లో బర్మింగ్‌హమ్‌ వేదికగా జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ను చేర్చడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బిడ్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలని ఐసీసీ ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

రెండో వన్డేలోనే అఫ్రిది రికార్డు సెంచరీ

రెండో వన్డేలోనే అఫ్రిది రికార్డు సెంచరీ

1996లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అఫ్రిది అరంగేట్రం చేసిన రెండో వన్డేలోనే శ్రీలంకపై కేవలం 37 బంతుల్లో సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. 398 వన్డేల్లో 8,064 పరుగులు, 395 వికెట్లు సాధించాడు. 27 టెస్టుల్లో 1,176 పరుగులతో పాటు 48 వికెట్లు పడగొట్టాడు. టీ20 ఫార్మాట్‌లో 98 మ్యాచ్‌లు ఆడి 1,405 పరుగులు, 97 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Story first published: Monday, December 3, 2018, 13:16 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X