న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sydney Test: స్టీవ్ స్మిత్‌ సెంచరీ.. సోబర్స్, రిచర్డ్స్ సరసన ఆసీస్ మాజీ కెప్టెన్ !!

Steve Smith hits 27th test hundred

సిడ్నీ: బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా భారత్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (102; 13 ఫోర్స్‌) సెంచరీ చేశాడు. 201 బంతుల్లో 102 పరుగులు చేశాడు. పేసర్ నవదీప్ సైనీ వేసిన 97వ ఓవర్ చివరి బంతికి మూడు పరుగులు తీసిన స్మిత్.. కెరీర్‌లో 27వ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. తొలి రెండు టెస్ట్‌ల‌లో 10 పరుగులే చేసి ఘోరంగా విఫ‌లమైన స్మిత్.. ఈ మ్యాచ్‌లో తన సత్తాచాటాడు. ఒక వైపు వికెట్స్ ప‌డుతున్నా.. బౌండరీల మోత మోగిస్తూ అద్భుత శతకం చేశాడు. దీంతో ఆసీస్ 300 పరుగుల మార్క్ అందుకుంది.

31 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో శుక్రవారం రెండో రోజు ఆట ప్రారంభించిన స్టీవ్ స్మిత్ రెండో సెషన్‌లో మూడంకెల స్కోర్‌ అందుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మార్నస్ లబుషేన్ ‌(91)తో మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం మిచెల్ స్టార్క్‌తో కలిసి స్మిత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. సెంచరీ చేయడంతో దిగ్గజాల సరసన చేశాడు స్మిత్. టీమిండియాపై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన గ్యారీ సోబర్స్ (30), వివ్ రిచర్డ్స్ (41), రికీ పాంటింగ్ (51) సరసన నిలిచాడు. అందరూ టీమిండియాపై 8 సెంచరీలు చేశారు. అయితే స్మిత్ 25 ఇన్నింగ్స్‌లలోనే 8 సెంచరీలు బాదాడు.

ఓవ‌ర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ఆసీస్‌కు రవీంద్ర జ‌డేజా (3/46) కోలుకోలేని షాక్ ఇచ్చాడు. మార్నస్‌ లబ్‌షేన్ (91‌; 11 ఫోర్లు), మాథ్యూ వేడ్ ‌( 3; 2 ఫోర్స్), పాట్ క‌మ్మిన్స్ (0) లాంటి కీల‌క వికెట్స్ తీసుకున్నాడు. ఇక కామెరూన్ గ్రీన్ (0), టీమ్ పైన్ (1)ల‌ను అద్భుత‌మైన బంతుల‌తో పెవీలీయ‌న్‌కు పంపాడు జస్ప్రీత్ బుమ్రా. మిచెల్ స్టార్క్ (24; 2 ఫోర్లు, 1 సిక్స్)ను నవదీప్ సైనీ ఔట్ చేశాడు. సిక్స్ బాది మంచి ఊపులో ఉన్న స్టార్క్.. గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

102 ఓవ‌ర్స్ ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 310 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్స్‌లో జ‌డేజా మూడు వికెట్స్ తీయ‌గా.. బుమ్రా, సైనీ రెండు.. సిరాజ్‌ఒక వికెట్ ద‌క్కించుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 166/2తో రెండో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు స్కోరు 188/2 పరుగుల వద్ద వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆపై వర్షం ఆగిపోవడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది.

Brisbane Test: ఆంక్షలు సడలిస్తేనే నాలుగో టెస్టు ఆడతాం.. లేదంటే ఇంటికే: బీసీసీఐ
https://telugu.mykhel.com/cricket/brisbane-test-bcci-formally-writes-to-ca-on-relaxation-of-quarantine-in-brisbane/articlecontent-pf55253-032544.html

Story first published: Friday, January 8, 2021, 9:19 [IST]
Other articles published on Jan 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X