న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sydney Test: నాలుగేసిన జడేజా.. ఆస్ట్రేలియా 338 ఆలౌట్!! స్టీవ్ స్మిత్ సెంచ‌రీ!

Sydney Test: Ravindra Jadeja bags 4 Australia 338-all out

సిడ్నీ: బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా భారత్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. భారత బౌలర్లు అందరూ రాణించడంతో 105.4 ఓవర్లలో 338 ప‌రుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (131; 16 ఫోర్స్‌) శ‌త‌కం సాధించ‌డంతో 300 పరుగుల మార్క్ చేరుకుంది. మార్కస్ లబుషేన్ (91: 196 బంతుల్లో 11x4), విల్ పకోస్కీ (62; 110 బంతుల్లో 4x4) హాఫ్ సెంచరీలు చేశారు. భార‌త బౌల‌ర్స్‌లో రవీంద్ర జ‌డేజా నాలుగు వికెట్స్ తీయ‌గా.. జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ రెండు వికెట్స్‌.. మొహ్మద్ సిరాజ్‌ ఓ వికెట్ ద‌క్కించుకున్నారు.

Sydney Test: స్టీవ్ స్మిత్‌ సెంచరీ.. సోబర్స్, రిచర్డ్స్ సరసన ఆసీస్ మాజీ కెప్టెన్ !!Sydney Test: స్టీవ్ స్మిత్‌ సెంచరీ.. సోబర్స్, రిచర్డ్స్ సరసన ఆసీస్ మాజీ కెప్టెన్ !!

లబుషేన్‌ను బోల్తా:

లబుషేన్‌ను బోల్తా:

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 166/2తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు స్కోరు 188/2 పరుగుల వద్ద వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు. ఆపై వర్షం ఆగిపోవడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారిన మార్నస్ లబుషేన్‌ను (91: 196 బంతుల్లో) స్పిన్నర్ రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపాడు. ఓ చక్కటి బంతికి లబుషేన్‌ స్లిప్‌లో కెప్టెన్ అజింక్య రహానేకు చిక్కాడు. 70.5 ఓవర్‌లో లబుషేన్ ఔట్ అయ్యాడు. లబుషేన్ తృటిలో శతకం చేజార్చుకున్నా స్టీవ్ స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

రెండో వికెట్ తీసిన జడేజా:

206 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన అనంతరం వికెట్‌ కీపర్‌ మాథ్యూ వేడ్ అండతో స్టీవ్ స్మిత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. క్రీజులో కుదురుకుంటున్న వేడ్‌ (13; 16బంతుల్లో 2x4)ను కూడా జడేజా బోల్తా కొట్టించాడు. జస్ప్రీత్ బుమ్రా అద్భుత క్యాచ్ అందుకోవడంతో వేడ్‌ ఇన్నింగ్స్ ముగిసింది. 76.5 ఓవర్‌లో గాల్లోకి షాట్‌ ఆడిన వేడ్‌.. బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో ఆసీస్‌ 232 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. జడేజా తొలి సెషన్‌లో రెండు వికెట్లు‌ తీశాడు. అక్కడి నుంచి ఆస్ట్రేలియా వికెట్ల పతనం మొదలైంది.

వరుస వికెట్లు:

అయితే రెండు వికెట్లు పడినా స్టీవ్ స్మిత్‌ మాత్రం భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని అర్ధ శతకం చేశాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ సిరీస్‌లో తొలిసారి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. భోజన విరామ సమయానికి ముందు కామెరాన్‌ గ్రీన్‌ (0)ను జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్‌ చేర్చాడు. ఆపై ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోటింది. కెప్టెన్‌ టిమ్ ‌పైన్ ‌(1), పాట్ కమిన్స్ ‌(0), నాథన్ లైయన్ ‌(0) పూర్తిగా విఫలమయ్యారు.

స్మిత్ సెంచరీ:

స్మిత్ సెంచరీ:

ఒకవైపు వికెట్లు పడుతున్నా స్టీవ్ స్మిత్ (102; 13 ఫోర్స్‌) మాత్రం అద్భుత సెంచరీ చేశాడు. 201 బంతుల్లో 102 పరుగులు చేశాడు. పేసర్ నవదీప్ సైనీ వేసిన 97వ ఓవర్ చివరి బంతికి మూడు పరుగులు తీసిన స్మిత్.. కెరీర్‌లో 27వ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. తొలి రెండు టెస్ట్‌ల‌లో 10 పరుగులే చేసి ఘోరంగా విఫ‌లమైన స్మిత్.. ఈ మ్యాచ్‌లో తన సత్తాచాటాడు. మిచెల్ స్టార్క్ ( 24; 2 ఫోర్స్, 1 సిక్స్‌) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఈ క్రమంలోనే స్మిత్‌ చివర్లో ధాటిగా ఆడుతూ జట్టు స్కోర్‌ 338 పరుగుల వద్ద జడేజా చేతిలో రనౌటయ్యాడు.

పకోస్కీ హాఫ్ సెంచరీ:

పకోస్కీ హాఫ్ సెంచరీ:

గురువారం టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్ ప్ర‌త్య‌ర్ధిపై పైచేయి సాధించింది. బౌలింగ్‌ వైఫల్యం, రిషబ్ పంత్‌ క్యాచ్‌లు వదిలేయడంతో ఆస్ట్రేలియా పుంజుకుంది. యువ ఓపెన‌ర్ విల్ పకోస్కీ (62; 110 బంతుల్లో 4x4) ఆకట్టుకున్నాడు. మార్నస్ లబుషేన్‌ (67; 149 బంతుల్లో 8x4) అర్ధ శతకం చేశాడు. వ‌ర్షం కార‌ణంగా తొలి రోజు 55 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే జ‌ర‌గ‌గా.. ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

Story first published: Friday, January 8, 2021, 10:15 [IST]
Other articles published on Jan 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X