న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sydney Test: జడేజా.. నువ్ దేవుడు సామీ!! నీ బుల్లెట్ త్రోకు ఓ దండం!! (వీడియో)

Sydney Test: Fans hails Ravindra Jadeja for his bullet throw to run out Steve Smith

సిడ్నీ: సిడ్నీ వేదిక‌గా భారత్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ 105.4 ఓవర్లలో 338 ప‌రుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (131; 226 బంతుల్లో 16 ఫోర్లు) శ‌త‌కం చేశాడు. మార్కస్ లబుషేన్ (91: 196 బంతుల్లో 11x4), విల్ పకోస్కీ (62; 110 బంతుల్లో 4x4) హాఫ్ సెంచరీలు బాదారు. భార‌త బౌల‌ర్స్‌లో రవీంద్ర జ‌డేజా నాలుగు వికెట్స్ తీశాడు. జ‌డేజా బుల్లెట్ త్రోకు స్టీవ్ ‌స్మిత్ చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. లేదంటే ఆసీస్ మరిన్ని పరుగుగులు చేసేది.

ఆ ఆలోచనే స్మిత్ కొంపముంచింది

ఆ ఆలోచనే స్మిత్ కొంపముంచింది

ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 31 పరుగుల వద్ద ఈరోజు బ్యాటింగ్‌ని కొనసాగించిన స్టీవ్ ‌స్మిత్.. ఒకవైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ సుదీర్ఘ ఫార్మాట్‌లో 27వ శతకం సాధించాడు. అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ టెస్టుల్లో విఫలమైన స్మిత్.. సిడ్నీలో మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయాడు. ముఖ్యంగా టెయిలెండర్లతో కలిసి దూకుడుగా ఆడాడు.

టెయిలెండర్లకి ఎక్కువగా స్ట్రైక్ ఇవ్వకుండా.. తానే బాధ్యత తీసుకుంటూ పరుగులు చేశాడు. టెయిలెండర్లకి స్ట్రైక్ ఇవ్వొద్దనే ఆలోచనే అతడి కొంపముంచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్ రవీంద్ర జ‌డేజా విసిరిన బుల్లెట్ త్రోకు బలయ్యాడు.

బుల్లెట్ త్రో

బుల్లెట్ త్రో

ఆసీస్ ఇన్నింగ్స్ 106వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బంతిని పాయింట్ దిశగా స్టీవ్‌ స్మిత్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ అంచు తాకిన బంతి బ్యాక్‌వర్డ్ స్వ్కేర్ లెగ్ దిశగా దూసుకెళ్లింది. దాంతో సింగిల్ పూర్తి చేసిన ‌స్మిత్.. స్ట్రైకింగ్ కోసం మరో పరుగు తీయాలనుకున్నాడు. రెండో పరుగు కోసం జోష్ హేజిల్‌వుడ్‌ని పిలిచాడు. ఇద్దరూ పరుగుకు వెళుతున్నారు. ఇదే సమయంలో స్వ్కేర్ లెగ్ నుంచి బంతిని వేగంగా అందుకున్న రవీంద్ర జడేజా వికెట్ కీపర్ ఎండ్‌ వైపు బుల్లెట్ త్రో విసిరాడు. బంతి కాస్త వికెట్లను నేరుగా గిరాటేసింది. ఇంకేముంది స్మిత్ రనౌట్ అయ్యాడు.

రహానే ఆశ్చర్యం

రహానే ఆశ్చర్యం

రవీంద్ర జడేజా వికెట్లపైకి బంతికి విసిరిన సమయంలో.. బ్యాకప్ కోసమని కెప్టెన్ అజింక్య రహానే వచ్చాడు. అయితే బంతి నేరుగా స్టంప్స్‌పైకి వస్తుండటంతో దాన్ని టచ్ చేయలేదు. బంతి వికెట్లని తాకింది. అప్పటికి క్రీజుకి చాలా దూరంలో స్టీవ్ స్మిత్ ఉండిపోయాడు. దీంతో రహానే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. స్మిత్ రనౌట్ అవ్వడం, ఆస్ట్రేలియా ఆలౌట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. అద్భుత త్రో విసిరిన జడేజాను జట్టు సభ్యులు అభినందించారు.

జడేజా.. ఏమా త్రో

రవీంద్ర జడేజా బుల్లెట్ త్రోకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు జడేజాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'రవీంద్ర జడేజా బుల్లెట్ త్రో' ఇది అని ఒకరు కామెంట్ చేయగా.. 'జడేజా.. నువ్ దేవుడు సామీ' అని మరొకరు ట్వీటారు. 'జడేజా ఏమా త్రో.. టీమిండియాకు నువ్ ఎంతో అవసారమని మరోసారి నిరూపించావ్', 'టీమిండియాకు అతి ముఖ్యమైన ఆటగాడు', 'ఇందుకే కదా.. మహీ భాయ్ నిన్ను సర్ జడేజా అనేది', 'రాక్ స్టార్ జడేజా', 'జడేజా 5 వికెట్లు (నాలుగు వికెట్లు, ఒక రనౌట్) పడగొట్టినట్టే', 'జడేజా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతం' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Story first published: Friday, January 8, 2021, 12:29 [IST]
Other articles published on Jan 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X