న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంగూలీ చూస్తుండగా 49 బంతుల్లో సురేశ్ రైనా సెంచరీ (వీడియో)

By Nageshwara Rao
Suresh Raina smashes a record 59-ball 126 at Eden Gardens

హైదరాబాద్: గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా సెంచరీతో చెలరేగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ తరుపున ఆడుతున్న సురేశ్ రైనా సోమవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో విజృంభించాడు.

సూపర్ లీగ్ గ్రూప్ బి మ్యాచ్‌లో భాగంగా సోమవారం బెంగాల్-ఉత్తర ప్రదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సురేశ్ రైనా 13 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 59 బంతుల్లో 126 పరుగులు చేశాడు. రైనా స్ట్రైక్ రేట్ 213.56గా ఉంది. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రైనా నిలిచాడు.

అంతకముందు మురళీ విజయ్ (చెన్నై సూపర్ కింగ్స్) 2010లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన 127 పరుగులే ఇప్పటి వరకు టీ20ల్లో భారత్ తరుపున అత్యధిక స్కోరు. రైనా విజృంభణతో ఉత్తర ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.

రైనా ఇన్నింగ్స్‌ను చూసిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం ప్రశంసలతో ముంచెత్తాడు. రైనా విషయానికి వస్తే భారత్ తరుపున చివరిసారిగా ఫిబ్రవరి 2017లో బెంగళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో దర్శనమిచ్చాడు. ఆ తర్వాత నుంచి భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సురేశ్ రైనాను అట్టి పెట్టుకుంది. భారత్ తరుపున ఇప్పటివరకు సురేశ్ రైనా 18 టెస్టులు, 223 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లాడాడు. టీ20ల్లో భారత అత్యుత్తమ ఆటగాళ్లలో సురేశ్ రైనా ఒకడు. టీ20ల్లో రైనా 7,000 పరుగులు నమోదు చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 16:03 [IST]
Other articles published on Jan 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X