
అగ్రస్థానంలో సురేశ్ రైనా
4,952 పరుగులతో సురేశ్ రైనా అగ్రస్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ (4,948), రోహిత్ శర్మ (4,493), గౌతమ్ గంభీర్ (4,217), రాబిన్ ఉతప్ప (4,081) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

140 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో చేధించిన చెన్నై
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో ఫా డుప్లెసిస్(42 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సులు)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి మూడు ఓవర్లలో చెన్నై విజయానికి 43 పరుగులు అవసరమైన తరుణంలో డుప్లెసిస్ చెలరేగాడు.

చెన్నై విజయంలో డుప్లెసిస్ కీలకపాత్ర
బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే విజయాని కావాల్సిన స్కోరును తగ్గించుకుంటూ వచ్చాడు. ఆఖరి ఓవర్‌లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా, డుప్లెసిస్ తొలి బంతినే సిక్స్ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్(15 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో చెన్నై ఐదు బంతులుండగానే విజయం సాధించింది.

సన్‌రైజర్స్‌కు మరో అవకాశం
ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. శుక్రవారం (మే 25)న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ తలో రెండు వికెట్లు తీసుకోగా భువీకి ఒక వికెట్ తీసుకున్నాడు.

వచ్చే ఏడాది ఐపీఎల్ వరకు రైనానే
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఈ ఏడాది ప్లేఆఫ్‌లో చోటు దక్కించుకోలేదు. కాబట్టి వచ్చే ఏడాది ఐపీఎల్ వరకు రైనానే అగ్రస్థానంలో కొనసాగనున్నాడు. అంతేకాదు ప్రతి ఐపీఎల్ సీజన్‌లోనూ 300లకు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రైనా అరుదైన ఘనత సాధించాడు.


Click it and Unblock the Notifications












