చెన్నై జట్టులోకి రైనా స్థానంలోకి ఎవ్వరినీ తీసుకోం

Posted By:
Suresh Raina Cannot be Replaced: CSK Coach Stephen Fleming

హైదరాబాద్: 'సురేశ్ రైనా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.' ఈ మాటలు అంటోంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్. గాయపడ్డ చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా స్థానంలో ఎవరిని తీసుకోవడంలేదని ఆ జట్టు ప్లేమింగ్‌ స్పష్టం చేశాడు. గత మంగళవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సురేశ్‌ రైనా గాయపడ్డ విషయం తెలిసిందే. కాలి పిక్క కండారాలు పట్టేయడంతో రైనా టోర్నీకి దూరం కానున్నాడని, అతని స్థానంలో వేరే ఆటగాడిని భర్తీ చేయనున్నారని జరుగుతున్న ప్రచారంపై ఫ్లెమింగ్‌ స్పందించాడు.

రైనా అద్భుత బ్యాట్స్‌మన్‌ అని, ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడని, అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేయలేమన్నాడు. రైనా మొహాలీ మ్యాచ్‌ ఆడటం లేదని, తరువాతి మ్యాచ్‌ వరకు అందుబాటులోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. తమ జట్టులో మంచి ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నారని, ధ్రువ్‌ షోరే, మురళి విజయ్‌లలో ఒకరు రైనా లేని లోటు తీర్చుతారని అభిప్రాయపడ్డారు. వీరికి మొహాలిలో ఆడిన అనుభవం ఉందని గుర్తు చేశారు.

చెన్నై మ్యాచ్‌లు పుణెకు తరలించడంపై ఫ్లేమింగ్‌ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వేలంలో చెన్నైకి అనువుగా ఉండే ఆటగాళ్లను మాత్రమే తీసుకున్నామని, కానీ మ్యాచ్‌లు తరలించడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. అయితే మ్యాచ్‌లను పుణెకు తరలించడం కొంత కలిసొచ్చె అంశమేనని అభిప్రాయపడ్డారు. గత సీజన్లలో సీఎస్‌కే కెప్టెన్‌ ధోని రైజింగ్‌ పుణెకు ప్రాతినిధ్యం వహించాడని, ఇది అతనికి మరో హోంగ్రౌండ్‌ లాంటిదని చెప్పుకొచ్చారు.

సీఎస్‌కే ఆదివారం మోహాలీ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌తో తలపడనుంది. ఇక రెండేళ్ల నిషేదం పునరాగమనం చేసిన సీఎస్‌కే ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లకు రెండు నెగ్గింది. ఉత్కంఠభరితంగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే చివరి వరకు పోరాడి గెలిచింది. తొలి మ్యాచ్‌లో సొంతగడ్డపైనే ముంబైని మట్టికరిపించగా.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని చేధించి విజయం సొంతం చేసుకుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 15, 2018, 16:58 [IST]
Other articles published on Apr 15, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి