న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్ ఖాతాలో మరో అరుదైన ఘనత: కాంప్టన్-మిల్లర్ మెడల్ సొంతం

By Nageshwara Rao
Super Smith wins Compton-Miller Medal

హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను అందుకోనున్నాడు. ప్రతిష్టాత్మక ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్‌ను స్టీవ్ స్మిత్ నేతృత్వంలోన ఆస్ట్రేలియా జట్టు 4-0తో కైవసం చేసుకున్న నేపథ్యంలో అతడిని కాంప్టన్-మిల్లర్ మెడల్ వరించింది.

సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో పర్యాటక ఇంగ్లాండ్ జట్టుపై ఆతిథ్య ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 123 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-0తో జేజిక్కించుకుంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

ఈ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ 137.40 యావరేజితో 687 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. స్మిత్ తర్వాత షాన్ మార్ష్ 242 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు వరుస విజయాలను అందించిన స్మిత్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డుని సైతం అందుకున్నాడు.

ఈ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ పెర్త్ వేదికగా జరిగిన మూడో టెస్టులో డబుల్ సెంచరీ (239) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాగా, 5 మ్యాచుల సిరీస్‌ను 4-0తో ఆసీస్ కైవసం చేసుకోవడంతో 104 పాయింట్లతో తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఇంగ్లాండ్‌ ఐదో స్థానానికి పడిపోయింది.

ఇక, ఎప్పటిలాగే 124 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Story first published: Monday, January 8, 2018, 12:33 [IST]
Other articles published on Jan 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X