పదేళ్ల ఐపీఎల్: పంజాబ్‌పై డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 27 బంతుల్లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసిన వార్నర్... మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

దీంతో సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ జట్టుపై వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీని నమోదుచేసి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

david warner

ఐపీఎల్‌లో మరే ఇతర ఆటగాడు ఓ జట్టుపై ఆరు వరుస ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డుని సాధించక పోవడం విశేషం. శనివారం నాటి మ్యాచ్‌లో 51 పరుగులు చేసిన వార్నర్.. గత ఐదు ఇన్నింగ్స్‌లలో వరుసగా 58, 81, 59, 52, 70 (నాటౌట్) పరుగులతో అర్ధ సెంచరీలు చేశాడు.

చివరగా ఏప్రిల్ 17న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ (70 నాటౌట్‌)గా నిలవడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌‌పై హైదరాబాద్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ (4-0-19-5) అద్భుత ప్రదర్శన చేశాడు.

Story first published: Friday, April 28, 2017, 22:51 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి