ఐపీఎల్‌లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా కోల్‌కతా ఆటగాడు

Posted By:
Sunil Narine becomes third bowler to take 100 IPL wickets, Twitterati heaps praise for ‘outstanding achievement’

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఏడేళ్లుగా ఆడుతున్న మ్యాజిక్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టిన అతడు 100 వికెట్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌తో కలిపి అతని కెరీర్‌లో 86 మ్యాచ్‌లు కలిపి 102 వికెట్లను పడగొట్టిన ఘనత అతని సొంతమైంది. దీంతో ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో తొలిస్థానంలో 154 వికెట్లతో లసిత్‌ మలింగా ఉన్నాడు.

 క్రిస్‌మోరీస్‌ను ఔట్ చేయడంతో వందో వికెట్‌ను

క్రిస్‌మోరీస్‌ను ఔట్ చేయడంతో వందో వికెట్‌ను

ఐపీఎల్ హిస్టరీలో 100 వికెట్లు తీసిన మార్క్‌ను అందుకున్న తొలి విదేశీ స్పిన్నర్‌గానూ అతడు నిలిచాడు. సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్లో క్రిస్‌మోరీస్‌ను ఔట్ చేయడంతో ఐపీఎల్ కెరీర్‌లో వందో వికెట్‌ను సాధించాడు. నరైన్ సోమవారం మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

గంభీర్ జట్టులో లేడనే మాటే కష్టంగా ఉంది

గంభీర్ జట్టులో లేడనే మాటే కష్టంగా ఉంది

మ్యాచ్‌ అనంతరం సునీల్‌ నరైన్‌ కామెంటేటర్లతో మాట్లాడాడు. ‘‘ గంభీర్‌ మా(కోల్‌కతా) జట్టుకాదా, మా ప్రత్యర్థా! ఈ విషయాన్ని జీర్ణించుకోవడం నాకైతే కష్టమైంది. కేకేఆర్‌ కోసం ఇద్దరం మనసుపెట్టి ఆడేవాళ్లం. గుండెలనిండా జట్టును గెలిపించాలనే కసి. కానీ ఇప్పుడు మా ఇద్దరివీ వేర్వేరు టీమ్‌లు. ఏం చేస్తాం, క్రికెట్‌లో ఇదంతా సహజమే కదా!'' అని నరైన్‌ చెప్పాడు.

మిగతావారికంటే కొంత వైవిధ్యాన్ని

మిగతావారికంటే కొంత వైవిధ్యాన్ని

తాను ఇప్పటికీ నూరుశాతం పరిపూర్ణ స్పిన్నర్‌ను కానని, అయితే మిగతావారికంటే ఎంతో కొంత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తానని, జట్టు అవసరాలకు తగ్గట్టు నడుచుకుంటానని తెలిపాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగిన నైట్‌రైడర్స్‌ 71 పరుగుల తేడాతో జయభేరి మోగించిన సంగతి తెలిసిందే.

86 మ్యాచ్‌లతో 2113 పరుగులు చేసిన నరైన్

86 మ్యాచ్‌లతో 2113 పరుగులు చేసిన నరైన్

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 86 మ్యాచ్‌లు ఆడిన నరైన్ 2113 పరుగులు చేయడంతో పాటు 102 వికెట్లు తీశాడు. ఇందులో ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉండటం విశేషం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన నరైన్ తన కెరీర్‌లో 17 బంతుల్లో వేగవంతమైన అర్ధశతకం పూర్తి చేశాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 17, 2018, 17:18 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి