న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌తో రెండో టీ20లో తప్పిన పెను ప్రమాదం

India VS West Indies 2nd T20 : Team India Escaped Serious Unhurt | Oneindia Telugu
Sunil Gavaskar, Sanjay Manjrekar escape serious accident at Lucknow’s Ekana Stadium

లక్నో: భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య లక్నోలో మంగళవారం జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించిన ఎకనా స్టేడియంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాళ్లు సునీల్‌ గావస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌లకు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం రెండో టీ20 మ్యాచ్‌ కోసం గావస్కర్‌, మంజ్రేకర్‌లు కామెంట్రీ బాక్సులోకి అడుగుపెడుతున్న సమయంలో గాజు తలుపు ముక్కలైంది.

'గాజు తలుపు పేక ముక్కల్లా కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఎవరికీ గాయలు కాలేదు.అందరం క్షేమంగా ఉన్నాం' అని మంజ్రేకర్‌ తెలిపాడు. 24 ఏళ్ల తర్వాత లఖ్‌నవూ అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. రెండ్రోజుల క్రితమే దానికి అటల్‌ బిహారి వాజ్‌పేయి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియమంటూ పేరు కూడా మార్చారు. ఈ ఘటనతో ​నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.

కామెంటరీ బాక్స్‌లోకి సునీల్‌ గావస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌లు చేరుకున్న కొద్దిసేపటికే గ్లాస్‌ డోర్స్‌ పగిలాయి. ఈ ఘటన నుంచి వారు త్రుటిలో తప్పించుకున్నారు. తాము లోపలికి ప్రవేశించగానే గ్లాస్‌ డోర్స్‌లో ఒకటి కుప్పకూలిందని అదృష్టవశాత్తూ తామంతా క్షేమంగా ఉన్నామని మంజ్రేకర్‌ చెప్పుకొచ్చారు.

కాగా ఇకానా స్పో‍ర్ట్స్‌ సిటీలోని ఈ స్టేడియం ప్రైవేట్‌ ఆస్ధి కావడంతో తామేమీ చేయలేమని యూపీ క్రికెట్‌ అసోనియేషన్‌ అధికారులు పేర్కొన్నారు. మ్యాచ్‌ను కవర్‌ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులు సైతం స్టేడియం నిర్వాహకుల వైఫల్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీడియా బాక్స్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్‌నెట్‌, వపర్‌ కనెక్షన్లు లోపభూయిష్టంగా ఉండటంతో పాటు పలుమార్లు విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు ఎదురవడంతో మీడియా ప్రతినిధులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.

Story first published: Wednesday, November 7, 2018, 11:03 [IST]
Other articles published on Nov 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X