న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనాపై పోరుకు సునీల్ గవాస్కర్‌ భారీ విరాళం!!

Sunil Gavaskar donated Rs 59 lakh for Covid-19 fight

ముంబై: భారత మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్‌ తన పెద్ద మనసును చాటుకున్నాడు. మహమ్మారి కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటానికి తన వంతు సాయంగా రూ.59 లక్షలు విరాళంగా ఇచ్చాడు. దీనిలో రూ.35 లక్షలు పీఎం కేర్స్‌కు, రూ.24 లక్షలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాడు. అయితే ఈ విష‌యాన్ని లిటిల్ మాస్ట‌ర్ నేరుగా ప్ర‌క‌టించ‌లేదు. ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మ‌జుందార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ్రువీక‌రించాడు.

రైనా బ్యాటింగ్.. ఔట్ ఔట్ అంటూ కూతురు అరుపులు (వీడియో)రైనా బ్యాటింగ్.. ఔట్ ఔట్ అంటూ కూతురు అరుపులు (వీడియో)

కరోనాపై పోరుకు సునీల్ గవాస్కర్‌ సాయం

'మహమ్మారి కరోనాపై పోరుకు బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌ రూ.59 లక్షలు సాయం చేశాడు. రూ.35 లక్షలు పీఎంకేర్స్‌కు, రూ.24 లక్షలు మహారాష్ట్ర సీఎం సహాయనిధికి ఇచ్చాడు. హ్యాట్స‌ఫ్ స‌ర్‌' అని ముజుందార్‌ ట్వీట్‌ చేశాడు. 70 ఏళ్ల గావస్కర్‌ అందించిన విరాళం మొత్తానికి ఓ విశేషం ఉంది. 1971 నుంచి 1987 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గావస్కర్‌ మొత్తం 35 సెంచరీలు చేశారు. ఇందులో 34 సెంచరీలు టెస్టు ఫార్మాట్‌లో, ఒక సెంచరీ వన్డే ఫార్మాట్‌లో చేశారు.

 సాయంలో కూడా సెంచరీలను గుర్తు తెస్తూ...

సాయంలో కూడా సెంచరీలను గుర్తు తెస్తూ...

మొత్తం 35 సెంచరీలకు సంఖ్యకు గుర్తుగా సునీల్ గవాస్కర్‌ రూ. 35 లక్షలను ప్రధానమంత్రి సహాయనిధికి ఇచ్చాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ఆడిన ఆయన 24 సెంచరీలు సాధించారు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు తరఫున చేసిన 24 సెంచరీల సంఖ్యకు గుర్తుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి గవాస్కర్‌ రూ. 24 లక్షలు అందించారు. ఈ ఆసక్తికర విషయాన్ని సునీల్‌ గవాస్కర్‌ తనయుడు రోహన్‌ గవాస్కర్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నాడు.

 పారుపల్లి కశ్యప్‌ కూడా...

పారుపల్లి కశ్యప్‌ కూడా...

భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి క్రీడాకారుడు, హైదరాబాద్‌కు చెందిన పారుపల్లి కశ్యప్‌ కరోనాపై పోరాటానికి మద్దతుగా తెలంగాణ సీఎం సహాయనిధికి తనవంతుగా రూ. 3 లక్షలు విరాళం ఇచ్చాడు. ప్రమాదకర కరోనా వైరస్‌పై పోరాటంలో తాను కూడా భాగమవుతానంటూ 15 ఏండ్ల యువ గోల్ఫర్‌ అర్జున్‌ భాటి ముందుకొచ్చాడు. పలువురు క్రీడాకారుల నుంచి స్ఫూర్తి పొందుతూ పీఎం కేర్స్‌కు రూ.4.30 లక్షలు విరాళమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించాడు. అయితే ఇప్పటి వరకు తన కెరీర్‌లో సాధించిన 102 ట్రోఫీలను ఇవ్వడం ద్వారా వచ్చిన మొత్తాన్ని దానం చేయడం విశేషం.

Story first published: Wednesday, April 8, 2020, 7:42 [IST]
Other articles published on Apr 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X