న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో ఐపీఎల్ మొదలెట్టండి.. గంగూలీకి గవాస్కర్‌ సూచన!!

Sunil Gavaskar Calls For Full-Fledged Womens IPL From Next Year To Unearth Talent
Sunil Gavaskar Calls For Full-Fledged Women's IPL From Next Year | Oneindia Telugu

ముంబై: భారత మహిళల జట్టు మెరుగవ్వడానికి బీసీసీఐ ప్రభావం ఎంతో ఉంది, మహిళల క్రికెట్‌ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వచ్చే ఏడాది నుంచి 'ఉమెన్స్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌'ను నిర్వహించాలని భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గవాస్కర్‌ సూచించారు. ఎనిమిది జట్లు లేకపోయినా.. కొన్ని జట్లతో అయినా మహిళల ఐపీఎల్‌ నిర్వహించడం క్రికెటర్లకు మేలు జరుగుతుందన్నారు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓడిన నేపథ్యంలో సన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆసీస్‌ అమ్మాయిల సంబరాలు.. పాప్‌ సింగర్‌ కేటీ పెర్రీతో చిందులు (వీడియో)!!ఆసీస్‌ అమ్మాయిల సంబరాలు.. పాప్‌ సింగర్‌ కేటీ పెర్రీతో చిందులు (వీడియో)!!

బీసీసీఐ ప్రభావం ఎంతో ఉంది:

బీసీసీఐ ప్రభావం ఎంతో ఉంది:

తాజాగా సునిల్‌ గవాస్కర్‌ మాట్లాడుతూ... 'భారత మహిళల జట్టు మెరుగవ్వడానికి బీసీసీఐ ప్రభావం ఎంతో ఉంది. బీసీసీఐ వారి పురోగతిపై దృష్టిసారిస్తుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు మన అమ్మాయిలను ఆస్ట్రేలియాకు పంపించి ముక్కోణపు సిరీస్‌ (ఇంగ్లాండ్‌, ఆసీస్‌, భారత్‌) ఆడించింది. దీంతో హర్మన్‌సేనకు పిచ్‌, అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం లభించింది. ఇది చాలా తెలివైన నిర్ణయం' అని అన్నారు.

 బీసీసీఐ మరో అడుగు వేయాలి:

బీసీసీఐ మరో అడుగు వేయాలి:

'మహిళల క్రికెటర్ల కోసం సౌరవ్ గంగూలీ, బీసీసీఐ మరో అడుగు వేయాలి. వచ్చే ఏడాది నుంచి ఉమెన్స్‌ ఐపీఎల్ నిర్వహించాలని నేను భావిస్తున్నా. దీంతో ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తారు. ఇప్పుడు ఉన్న ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో రాణించి జాతీయ జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా మహిళా జట్టు ఎంతో పటిష్ఠంగా నిలవడానికి ఆసీస్‌ క్రికెట్ బోర్డు ఎన్నో ఏళ్ల కృషి ఉంది. అక్కడి క్రికెటర్లుకు 'ఉమెన్స్‌ బిగ్‌ బాష్ లీగ్‌' ఎన్నో అవకాశాలు ఇచ్చింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఉమెన్స్‌ బీబీఎల్‌ ఆడారు. ఆ టోర్నమెంట్‌లో బలమైన ప్రత్యర్థులతో ఆడొచ్చు. దీంతో ఆటలో ఎంతో పరిణతి సాధించవచ్చు' సన్నీ పేర్కొన్నారు.

మహిళా క్రికెటర్లు వెలుగులోకి వస్తారు:

మహిళా క్రికెటర్లు వెలుగులోకి వస్తారు:

'భారత్‌లో నైపుణ్యం ఉన్న ఎంతో మంది యువ క్రికెటర్లు ఐపీఎల్‌తో పరిచయమయ్యారు. దీంతో జాతీయ జట్టులో వారికి చోటు లభించింది. ఐపీఎల్ మాదిరిగానే ఆసీస్‌లో ఉమెన్స్‌ బీబీఎల్‌ పనిచేసింది. అందుకే ఆసీస్‌ ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉంది. ఐపీఎల్‌ తరహాలోనే మహిళల కోసం బీసీసీఐ 'ఉమెన్స్‌ టీ20 ఛాలెంజ్‌' నిర్వహిస్తుంది. అయితే దీనిలో కేవలం మూడు జట్లే ఉన్నాయి. బిగ్‌ బాష్‌ తరహాలో ఎక్కువ జట్లతో నిర్వహిస్తే యువ మహిళా క్రికెటర్లు వెలుగులోకి వస్తారు' అని గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు.

ఎక్కువ క్రికెట్‌ ఆడిస్తే:

ఎక్కువ క్రికెట్‌ ఆడిస్తే:

'ప్రస్తుత భారత మహిళా జట్టు అద్భుతంగా ఉంది. వారితో ఎక్కువ క్రికెట్‌ ఆడిస్తే ఎంతో మెరుగువుతారు. జట్టులో చాలా మంది యువ క్రీడాకారిణులే ఉన్నారు. వారందరూ ఇంకా నేర్చుకోవచ్చు. మెగా టోర్నీలో బాగా ఆకట్టుకున్నారు' అని సన్నీ చెప్పుకొచ్చారు. ఐపీఎల్ సూపర్‌నోవాస్‌, ఐపీఎల్‌ వెలాసిటీ, ఐపీఎల్ ట్రెయిల్‌బ్లేజర్స్‌ జట్లు ఉమెన్స్‌ టీ20 ఛాలెంజ్‌లో ఆడుతున్నాయి.

Story first published: Tuesday, March 10, 2020, 12:33 [IST]
Other articles published on Mar 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X