న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్‌కు 'హైదరాబాదీ' కుర్రాడు: ఎవరీ బావనక సందీప్!

IPL 2020 : Sunrisers Hyderabad Picked Hyderabadi Player For Huge Amount ! || Oneindia Telugu
Sun shines on studious southpaw Bavanaka Sandeep

హైదరాబాద్: ఐపీఎల్ వేలం ముగిసింది. వేలంలో భాగంగా హైదరాబాద్‌‌లోని రామ్‌నగర్‌కు చెందిన బావనక సందీప్ అనే 27 ఏళ్ల యువ ఆటగాడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో గత వేలంలో నగరం నుంచి మహ్మద్ సిరాజ్‌‌ ఎంపిక కాగా.. ఈ సీజన్‌లో సందీప్‌ చోటు దక్కించుకున్నాడు.

ప్రస్తుతం బావనక సందీప్‌ పంజాబ్‌లో హైదరాబాద్ జట్టు తరుపున రంజీ మ్యాచ్‌ ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో సందీప్‌ తన అద్భుతమైన ఆటతీరుని కనబర్చాడు. ఈ టోర్నీలో మొత్తం 7 ఇన్నింగ్స్‌లు ఆడి 261 పరుగులు సాధించగా, అందులో 4 ఇన్సింగ్స్‌లో నాటౌట్‌గా నిలిచాడు.

18 ఏళ్ల వయసులో 2010లో రంజీల్లో అరంగేట్రం చేసిన సందీప్ తన మొదటి మ్యాచ్‌లోనే జార్ఖండ్‌పై సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 75 ఏళ్ల హైదరాబాద్‌ రంజీ చరిత్రలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటవరకు 54 రంజీ మ్యాచ్‌లు ఆడి 48.5 యావరేజితో దూసుకుపోతున్నాడు.

తన క్రికెట్ కెరీర్‌లో మొత్తం 7 సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ, 21 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ అయిన సందీప్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ రంజీ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. సందీప్‌ మూడో తరగతి వరకు రామ్‌నగర్‌లోని మదర్స్‌ హైస్కూల్‌లో చదువుకున్నాడు. 4 నుంచి 10వ తరగతి వరకు ఈస్ట్‌ మారేడ్‌పల్లిలోని సెయింట్‌ ఆండ్రూస్‌ హైస్కూల్‌లో విద్యను అభ్యసించాడు.

సంతోషం వ్యక్తం చేసిన సందీప్

సంతోషం వ్యక్తం చేసిన సందీప్

ఆ తర్వాత సెయింట్‌ జాన్స్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, బీటెక్‌‌ను తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం స్పోర్ట్స్‌ కోటాలో ఇన్‌కమ్ ట్యాక్స్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సాధించాడు. ఐపీఎల్‌ వేలంలో తనను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కొనుగోలు చేయడంపై సందీప్ సంతోషం వ్యక్తం చేశాడు.

అద్భుత అవకాశం

అద్భుత అవకాశం

ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ "ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఎంపికకావడం చాలా ఆనందంగా ఉంది. 60 రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నమెంట్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, వీవీఎస్‌ లక్ష్మణ్‌తో పాటు హేమాహేమీలతో కలిసుండే అద్భుత అవకాశం దక్కింది. ఈ ప్రయాణంలో వారి అనుభవాలను తెలుసుకునే అవకాశముంది" అని అన్నాడు.

బ్యాటింగ్‌ మీదే దృష్టి పెడతా

"ఆల్‌రౌండర్‌ని అయినప్పటికీ ప్రధానంగా బ్యాటింగ్‌ మీదే దృష్టి పెడతా. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో నా ఆటతీరుతోనే ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. బ్యాటింగ్‌లో మెళకులను అంబటి రాయుడి వద్ద నేర్చుకున్నాను. అతడికి, నన్ను సన్‌రైజర్స్‌కు ఎంపిక చేసిన లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌లో ఓనమాలు నేర్పించిన మా నాన్నకు, కోచ్‌ జాన్‌ మనోజ్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటాను" అని అన్నాడు.

తన 19వ ఏటనే

తన 19వ ఏటనే

ఇక, సందీప్ తండ్రి బావనక పరమేశ్వర్‌ తన 19వ ఏటనే భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)లో టెక్నీషియన్‌గా ఉద్యోగంలో చేరారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే బీడీఎల్‌ తరఫున 1978 నుంచి 1990 వరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో లీగ్‌ మ్యాచ్‌లను ఆడారు. 1990 నుంచి 2000 వరకు హెచ్‌సీఏ తరఫున క్రికెట్‌ మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేశారు.

తన బిడ్డ పూర్తిస్థాయి క్రికెటర్‌ కావాలంటే

తన బిడ్డ పూర్తిస్థాయి క్రికెటర్‌ కావాలంటే

తన కుమారుడిని కూడా క్రికెటర్‌గా చూడాలని ఆశపడ్డ పరమేశ్వర్‌ కొడుకుకు ఐదేళ్ల వయసు నుంచే తానే గురువుగా క్రికెట్‌ ఓనమాలను దిద్దించాడు. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటి పక్కనే ఉన్న గ్రౌండ్‌లో రోజూ క్రికెట్‌లో కొడుకు సందీప్‌కు మెళకువలు నేర్పేవారు. అయితే, ఈ సమయం సరిపోదని, తన బిడ్డ పూర్తిస్థాయి క్రికెటర్‌ కావాలంటే మరింత సమయాన్ని వెచ్చించాలని భావించారు.

ఉన్నతమైన క్రికెటర్‌గా చూడాలని

ఉన్నతమైన క్రికెటర్‌గా చూడాలని

తన కొడుకును ఉన్నతమైన క్రికెటర్‌గా చూడాలని నిర్ణయించుకున్న పరమేశ్వర్‌ తన ఎనిమిదేళ్ల సర్వీసును వదులుకున్నారు. వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న సందీప్‌‌కు పూర్తిస్థాయి శిక్షణ కోసమే సమయాన్ని కేటాయించారు. స్వతహాగా కుడిచేతివాటం అయిన సందీప్‌ను ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్‌గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. బౌలింగ్‌లోనూ తర్ఫీదునిచ్చారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ కౌంటీల్లో ఆడేందుకు పంపించారు.

సంతోషం వ్యక్తం చేసిన సందీప్ తల్లిదండ్రులు

సంతోషం వ్యక్తం చేసిన సందీప్ తల్లిదండ్రులు

సందీప్ తల్లిదండ్రులు పరమేశ్వర్, ఉమారాణిలు మాట్లాడుతూ "నేను ఏం కోరుకున్నానో నా బిడ్డ దానిని సాధించాడు. చాలా సంతోషంగా ఉంది. సందీప్‌ను క్రికెటర్‌గా చూడాలని నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. నా పదేళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కిందనుకుంటున్నా. నా బిడ్డకు ఆల్‌ రౌండర్‌గా ప్రతిభ ఉంది. భారత జట్టులో ఆడే అవకాశం దక్కాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

సందీప్ ప్రతిభను గుర్తించిన కోచ్‌ జాన్‌ మనోజ్‌

సందీప్ ప్రతిభను గుర్తించిన కోచ్‌ జాన్‌ మనోజ్‌

నాలుగో తరగతి నుంచే సందీప్‌ను ఈస్ట్‌ మారేడ్‌పల్లిలోని సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సందీప్‌కు కోచ్‌ జాన్‌ మనోజ్‌ క్రికెట్‌ నేర్పిస్తున్నారు. సందీప్‌లోని ప్రతిభను గుర్తించి సెయింట్‌ ఆండ్రూస్‌లో స్పోర్ట్స్‌ కోటాలో ప్రవేశం కల్పించాలని ప్రిన్సిపల్‌కు సిఫారసు చేశారు. అయితే, అందుకు ప్రిన్సిపల్‌ నిరాకరించడంతో భవిష్యత్‌లో రాష్ట్ర, దేశస్థాయిలో క్రికెట్‌ ఆడే సత్తా ఉందని, తన మీద నమ్మకంతో అడ్మిషన్‌ ఇవ్వాలని గట్టిగా కోరడంతో ప్రిన్సిపల్‌ అంగీకరించారు. తాజాగా సందీప్‌ ఐపీఎల్‌కు ఎంపకవడంపై కోచ్‌ జాన్‌ మనోజ్‌ హర్షం వ్యక్తం చేశాడు.

Story first published: Friday, December 20, 2019, 17:35 [IST]
Other articles published on Dec 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X