న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పూరన్‌ శిక్షతో నాకు సంబంధం ఏంటి.. అతనికి తక్కువ శిక్ష వేస్తే ఇబ్బందేమీ లేదు'

Steve Smith said he had no issues with Nicholas Pooran punishment for ball-tampering

బ్రిస్బేన్‌: వెస్టిండీస్‌ యువ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ శిక్షతో నాకు సంబంధం ఏంటి. అతనికి తక్కువ శిక్ష వేస్తే నాకు వచ్చే ఇబ్బందేమీ లేదు అని ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో నికోలస్‌ పూరన్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో అతనిపై నాలుగు టీ20 మ్యాచ్‌ల నిషేధం పడింది. గత ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించిన స్టీవ్‌ స్మిత్‌ ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు.

12 నెలలు సస్పెన్షన్‌:

12 నెలలు సస్పెన్షన్‌:

స్మిత్‌తో పాటు డేవిడ్‌ వార్నర్‌ సైతం ట్యాంపరింగ్‌లో భాగం కావడంతో అతనిపై కూడా 12 నెలలు సస్పెన్షన్‌ పడగా.. బెన్‌క్రాఫ్‌పై 9 నెలల నిషేధం పడింది. ఈ వారం బ్రిస్బేన్‌లో పాకిస్థాన్‌తో ప్రారంభ టెస్టుకు ముందు స్మిత్ మీడియాతో మాట్లాడాడు. పూరన్‌కు ఎందుకు స్వల్ప శిక్ష పడిందని స్మిత్‌ను ఓ జర్నలిస్ట్ అడగ్గా.. అతనికి తక్కువ నిషేధం పడితే నాకేం సంబంధం అని ప్రశ్నించాడు. పూరన్‌కు ఓ మోస్తరు శిక్ష వేయడంతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేసాడు.

 పూరన్‌ శిక్షతో నాకు సంబంధం ఏంటి:

పూరన్‌ శిక్షతో నాకు సంబంధం ఏంటి:

'ప్రతీ ఒక్కరూ భిన్నంగా ఉంటారు. ప్రతీ బోర్డు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చాలా విషయాలు మిళితమై ఉంటాయి. నాకు కఠినమైన శిక్ష పడిందని నేనేమీ బాధపడడం లేదు. అది గతం. నేను గతం నుంచి బయటికి వచ్చా. ఇప్పుడు భవిష్యత్తుపై దృష్టి పెట్టా. పూరన్‌ శిక్షతో నాకు సంబంధం ఏంటి. అతనికి తక్కువ శిక్ష వేస్తే నాకు వచ్చే ఇబ్బందేమీ లేదు' అని స్మిత్ అన్నాడు.

తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు:

తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు:

'బార్బడోస్ ట్రైడెంట్స్ కోసం పూరన్‌తో కలిసి ఆడాను. నాకు పూరన్‌ బాగా తెలుసు. అతనితో చాలా క్రికెట్‌ ఆడిన అనుబంధం ఉంది. అతనొక ప్రతిభావంతుడు. పూరన్‌కు మంచి భవిష్యత్తు ఉంది. అతను చేసిన తప్పిదాల నుంచి త్వరగానే పాఠాలు నేర్చుకుంటాడు. ఆ సంఘటనతో చాలా నేర్చుకున్నా. ఇలాంటి మళ్లీ పునరావృతం కావు' అని స్మిత్‌ పేర్కొన్నాడు.

నాలుగు టీ20 మ్యాచ్‌ల నిషేధం:

నాలుగు టీ20 మ్యాచ్‌ల నిషేధం:

లక్నోలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో పూరన్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఐసీసీ అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. బంతి ఆకారాన్ని మార్చినట్లు పూరన్‌ అంగీకరించడంతో పాటు క్షమాపణలు కూడా కోరాడు. సస్పెన్షన్‌ కారణంగా పూరన్‌ తదుపరి నాలుగు టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని లెవెల్‌-3 నిబంధనను అతిక్రమించడంతో ఆర్టికల్ 2.14 ప్రకారం నాలుగు సస్పెన్షన్‌ పాయింట్లను విధించామని ఐసీసీ తెలిపింది.

Story first published: Tuesday, November 19, 2019, 18:52 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X