సెప్టెంబరులో కొత్త ఇన్నింగ్స్‌: పెళ్లి పీటలెక్కనున్న మరో క్రికెటర్‌

Posted By:
Steve Smith to marry girlfriend Dani Willis in September

హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఇటీవలే స్వదేశంలో ఇంగ్లాండ్‌‌‌తో జరిగిన యాషెస్ టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకున్న స్టీవ స్మిత్.. ఈ ఏడాది చివర్లో తన గర్ల్ ప్రెండ్ డాని విల్స్‌ను పెళ్లాడబోతున్నాడు.

స్మిత్‌కు అలెన్ బోర్డర్ మెడల్: ఐదో క్రికెటర్‌గా అరుదైన ఘనత

మూడు రోజుల క్రితం మెల్‌బోర్న్‌లో పల్లాడియం క్రౌన్‌లో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో గతేడాది అద్భుత ప్రదర్శన చేసిన పురుష, మహిళా క్రికెటర్లకు అలెన్‌ బోర్డర్‌, బెలిందా క్లార్క్‌ పతకాలను అందజేశారు.

2017 సంవత్సరానికి గాను క్రికెట్ అలెన్ బోర్డర్ పతకాన్ని స్టీవ్ స్మిత్ దక్కించుకోగా, బెలిందా క్లార్క్ పతకానికి ఆసీస్ మహిళా జట్టు క్రికెటర్ ఎల్లీ పెర్రీకి దక్కింది. ఒకటి కంటే ఎక్కువ సార్లు అలెన్ బోర్డర్ పతకాన్ని దక్కించుకున్న క్రికెటర్ల జాబితాలో స్టీవ్ స్మిత్ ఐదోవాడు. ఈ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు.

AB medal night and isn't @dani_willis looking absolutely stunning.

A post shared by Steve Smith (@steve_smith49) on Feb 12, 2018 at 1:08am PST

ఈ కార్యక్రమం అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో డాని విల్లీ మాట్లాడుతూ 'అంతర్జాతీయ మ్యాచ్‌లతో స్మిత్‌ బిజిగా ఉన్నాడు. సెప్టెంబరులో కాస్త విరామం దొరకడంతో అప్పుడే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం' అని తెలిపింది. 2011-12 బిగ్‌బాష్‌ లీగ్‌ సీజన్‌ జరిగే సమయంలో ఓ బార్‌లో స్మిత్‌ తొలిసారి విల్స్‌ను కలిశాడు.

గతేడాది జూన్‌ 29న న్యూయార్క్‌లో ఓ ఎత్తైన భవనంపై నుంచి తన గర్ల్‌ఫ్రెండ్‌ డాని విల్స్‌కు తన ప్రేమను వ్యక్తం చేసిన స్మిత్‌ ఈ ఏడాది పెళ్లి చేసుకోనున్నాడు. ప్రేయసితో ఎంగేజ్‌మెంట్‌ అయినట్లు అప్పట్లో స్మిత్‌ తన ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరూ అనేక కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉన్నారు.

Today I got down on one knee and @dani_willis said YES 🍾💍#engaged

A post shared by Steve Smith (@steve_smith49) on Jun 28, 2017 at 1:52pm PDT

Great to share a special summer with @dani_willis ❤️ thanks for all of the support!

A post shared by Steve Smith (@steve_smith49) on Jan 10, 2018 at 4:09pm PST

Story first published: Thursday, February 15, 2018, 10:37 [IST]
Other articles published on Feb 15, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి