న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాళ్లు మోసగాళ్లు కాదు: టీ20ల్లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీపై దాదా

Steve Smith is a Fantastic Player, Dont Think He Cheated: Sourav Ganguly

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణం నేపథ్యంలో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ పట్ల సానుభూతి వ్యక్తం చేశాడు. 'వాళ్ల పట్ట సానుభూతి వ్యక్తం చేస్తున్నా. స్మిత్ ఒక అద్భుతమైన ఆటగాడు. మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాడు. ఆస్ట్రేలియా జట్టుకు మరిన్ని పరుగులు తెచ్చిపెడతాడు.' అంటూ ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ పుస్తకాన్ని లాంచ్ చేయడానికి వచ్చిన గంగూలీ మాట్లాడాడు.

'బాల్ ట్యాంపరింగ్ విషయంలో వార్నర్, స్మిత్‌లు ఏడాది నిషేదానికి గురికాగా, బాన్ క్రాప్ట్ తొమ్మిది నెలలు నిషేదానికి గురైయ్యాడు. వాళ్లు తప్పు చేశారు. దానిని మోసం అనడం ఏ మాత్రం సరికాదు. వాళ్లు ముగ్గురు తిరిగి ఆస్ట్రేలియా జట్టులో ఆడాలి. వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటున్నా'' అని గంగూలీ తెలిపాడు.

ఇదిలా ఉంటే, అసోసియేషన్ ఆఫ్ క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్, వార్నర్‌ల నిషేదంపై అప్పీలు చేయాలని కోరుతుండటంపై స్మిత్ స్పందించాడు. తనకు అప్పీలు చేయడం ఇష్టం లేదన్నాడు.

బుధవారం ముంబైలోని తాజ్ బాంద్రా హోటలో గంగూలీ ఆటో బయోగ్రఫీ 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పుస్తకా ఆవిష్కరణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గంగూలీతో పాటుగా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ కూడా విచ్చేశారు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్‌ శర్మ త్వరలో టీ20 క్రికెటలో కూడా డబుల్ సెంచరీ సాధిస్తాడని గంగూలీ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. 'వన్డేల్లో తొలి ద్విశతకం సాధించిన సచిన్‌ ఎందరికో స్ఫూర్తి. రోహిత్‌ శర్మ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. టీ20ల్లో కూడా అతడు డబుల్ సెంచరీ సాధిస్తాడు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు' అని గంగూలీ అన్నాడు.

'చాపెల్‌ వల్ల జట్టులో స్థానం కోల్పోయి తిరిగి పొందడం నా క్రికెట్‌ కెరీర్‌లో పెద్ద విజయం. జట్టులో స్థానం పొందడానికి చాలా కష్టపడ్డాను. ఎట్టకేలకు జట్టులో స్థానం దక్కించుకున్నాను. అప్పుడే మానసకింగా ఎంతో దృఢత్వం సాధించాను. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే ముందు నాలుగేళ్లు బ్యాటింగ్‌లో బాగా రాణించాను. నాకే కాదు సచిన్‌కు కూడా ఆ నాలుగేళ్లు తన కెరీర్‌లో బెస్ట్‌ పిరియడ్‌' అని గంగూలీ తెలిపాడు. ఇందులో భాగంగా మాట్లాడుతూ.. 2002లో లార్ట్ స్టేడియంలో టీ షర్ట్ విప్పేసి తిరిగిన విషయంపై ప్రస్తావించాడు.

Story first published: Thursday, April 5, 2018, 18:44 [IST]
Other articles published on Apr 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X