న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్చర్‌ బౌన్సర్‌ను ఎదుర్కొనడంలో స్మిత్‌ చేసిన పొరపాటిదే: సచిన్ విశ్లేషణ

Steve Smith has complicated technique but an organised mindset:Tendulkars analysis of Smith

హైదరాబాద్: యాషెస్ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవలే ముగిసిన ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో స్మిత్ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. మొత్తం ఏడు ఇన్నింగ్స్‌ల్లో స్మిత్‌ ఏకంగా 774 పరుగులతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత యాషెస్ సిరిస్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన స్టీవ్ స్మిత్ అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సందర్భంగా సచిన్ తన ట్విట్టర్‌లో "స్మిత్‌ పునరాగమనం నమ్మశక్యం కానిది" అంటూ ట్వీట్‌ చేశాడు. యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌ బ్యాటింగ్ టెక్నిక్‌ను విశ్లేషిస్తూ సచిన్‌ తన ట్విట్టర్‌లో వీడియోని కూడా పోస్టు చేశాడు.

<strong>ఎవరూ సాగనంపకముందే అతడే వెళ్ళిపోవాలి!!: ధోనీ రిటైర్మెంట్‌పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు</strong>ఎవరూ సాగనంపకముందే అతడే వెళ్ళిపోవాలి!!: ధోనీ రిటైర్మెంట్‌పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

స్మిత్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ గురించి

స్మిత్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ గురించి

స్టీవ్ స్మిత్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ గురించి సచిన్ వివరించిన తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. "ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్మిత్‌ను స్లిప్‌‌లో ఔట్‌ చేసేందుకు ప్రయత్నించారు. కానీ స్మిత్‌ అడ్డంగా అటు ఇటూ కదులుతూ తన లెగ్‌స్టంప్‌ను పూర్తిగా కనిపించేలా ఆడాడు. ఆఫ్‌స్టంప్‌ అవతల పడిన బంతులను పూర్తిగా వదిలేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ పేసర్లు అతడిని ఔట్ చేయడంలో ఇబ్బంది పడ్డారు" అని అన్నాడు.

ఆర్చర్‌ వేసిన బౌన్సర్‌ను ఎదుర్కొనడంలో

ఆర్చర్‌ వేసిన బౌన్సర్‌ను ఎదుర్కొనడంలో

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ వేసిన బౌన్సర్‌ను ఎదుర్కొనడంలో స్మిత్‌ చేసిన పొరపాటుపై కూడా సచిన్ టెండూల్కర్ స్పందించాడు. "లార్డ్స్‌ టెస్టులో అతడికి లెగ్‌ స్లిప్‌ను పెట్టాలని ఇంగ్లాండ్‌ నిర్ణయించింది. జోఫ్రా ఆర్చర్‌ బౌన్సర్లతో అతడిని ఇబ్బంది పెట్టాడు. ఆర్చర్ లైన్ అండ్ లెంత్ బంతులు వేయడంతో బ్యాక్‌ఫుట్‌పై ఆడడంతో స్మిత్‌ ఇబ్బంది పడ్డాడు. ఆర్చర్‌ ఎప్పుడు షార్ట్‌ బాల్‌ వేసినా స్మిత్‌ పుల్‌ చేయడానికి ప్రయత్నించలేదు. డిఫెండ్‌ చేశాడు. అందువల్లే అతడి తలకు బంతి తగిలింది" అని సచిన్ చెప్పుకొచ్చాడు.

స్మిత్‌ వెనక్కి వంగకుండా ముందుకు

స్మిత్‌ వెనక్కి వంగకుండా ముందుకు

"ఇక, నాలుగో టెస్టులో స్మిత్‌ వెనక్కి వంగకుండా ముందుకు వంగుతూ బంతులను వదిలి పెట్టడంపైనే శ్రద్ధ చూపించాడు. దీంతో జోఫ్రా ఆర్చర్‌ షార్ట్‌ బంతితో పరీక్షించినా స్మిత్‌ తన భుజాన్ని ముందు వంచుతూ బంతిని జారవిడిచాడు. అయితే, గత మ్యాచ్‌ల్లో ఆడినట్లుగా ఆడితే ఇబ్బంది పడేవాడు. రెండో టెస్టు దెబ్బకు స్మిత్ ఆ తర్వాత తన టెక్నిక్‌ను మరింతగా మార్చుకున్నాడు" అని సచిన్ పేర్కొన్నాడు.

Story first published: Friday, September 20, 2019, 12:00 [IST]
Other articles published on Sep 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X