న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దేశవాళీ క్రికెట్‌లో ఆడనివ్వండి: సీఏను కోరనున్న స్మిత్, వార్నర్!

By Nageshwara Rao
Steve Smith, David Warner to push for relaxation of their cricket bans - Reports

హైదరాబాద్: బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తమకు విధించిన నిషేధంపై సడలింపు ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కోరుతున్నారు. ఇందులో భాగంగా దేశవాళీ క్రికెట్‌లో తమను ఆడేందుకు అవకాశం ఇవ్వాలని సీఏను కోరారు.

కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా కూడా వీరిపై కఠినంగా చర్య తీసుకుంది. స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్‌క్రాప్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది.

దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్‌ వార్నర్‌ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది. కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది.

అయితే, ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది. అయితే, ఆ తర్వాత క్రికెట్‌ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంతో వీరిద్దరిని ఐపీఎల్ ఆడకుండా బీసీసీఐ కూడా నిర్ణయం తీసుకుంది.

స్మిత్‌కు నా సానుభూతిని తెలుపుతున్నా..: డుప్లెసిస్స్మిత్‌కు నా సానుభూతిని తెలుపుతున్నా..: డుప్లెసిస్

ఇక, ఇంగ్లిష్ కౌంటీ క్లబ్ సోమర్సెట్ బాన్‌క్రాఫ్ట్‌తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. బాల్ టాంపరింగ్ ఘటనలో క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన శిక్ష తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వాళ్లు పాల్పడిన నేరానికి ఈ శిక్ష చాలా ఎక్కువని, అందువల్ల దానిని కాస్త సడలించాల్సిందిగా ఈ ముగ్గురి తరఫు అడ్వైజర్లు సీఏను కోరనున్నారు. గతంలో బాల్ టాంపరింగ్ వివాదంలో ఈ స్థాయి నిషేధం లేదన్న విషయాన్ని ప్లేయర్స్ యూనియన్ గుర్తు చేసింది.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు గ్రెడ్ డయర్ మాట్లాడుతూ 'స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్ పట్ల సీఐ ఇంత కఠినంగా వ్యవహరించడం సరి కాదు. గతంలో ఎన్నడూ ఏ ఆటగాడి పట్ల సీఏ ఇలా వ్యవహరించలేదు. గతంలో బాల్ టాంపరింగ్ సందర్భంగా తీసుకున్న చర్యలన్నింటినీ ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యయనం చేసింది' అని ఆయన అన్నారు.

'గరిష్ఠంగా రెండు వన్డేల నిషేధం మాత్రమే విధించనట్లు గుర్తించింది. వీరి విషయంలోనే ఇలా జరిగింది. ఆటగాళ్లకు విధించిన శిక్షను తగ్గించాలి. అలాగే దేశవాళీ క్రికెట్‌లో వారు ఆడేందుకు అనుమతి ఇవ్వాలని త్వరలో సీఏని కలిసి కోరతాం. వీరు చేసింది తప్పే. ఆ తప్పును వారు కూడా ఒప్పుకున్నారు. మీడియా ముందుకు వచ్చి స్వయంగా క్షమాపణలు కోరారు. అలాంటప్పుడు కూడా వారిపై కఠిన శిక్షలు విధించడం న్యాయం కాదు' అని ఆయన అన్నారు.

ఈ ముగ్గురూ దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడకపోతే.. నిషేధం ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని వారు వాదిస్తున్నారు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లపై నిషేధం విధించినా.. అది ఆస్ట్రేలియా బయట ఆడటాన్ని కూడా నిషేధిస్తుందా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.

Story first published: Tuesday, April 3, 2018, 14:06 [IST]
Other articles published on Apr 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X