న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ అదో టైప్.. అశ్విన్ పక్కన పెట్టి.. రహానే, పుజారాను ఆడించగలడు! ఇంగ్లండ్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు!

Steve Harmison says It wouldn’t surprise me if Ravi Ashwin doesn’t play the South Africa Test series

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి అర్థం కాదని ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ అన్నాడు. అప్‌కమింగ్ సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టి.. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలను ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు.తాజాగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అశ్విన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 372 పరుగుల భారీ తేడాతో నెగ్గి 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

అశ్విన్‌పై వేటు వేసినా..

అశ్విన్‌పై వేటు వేసినా..

ఈ సిరీస్‌లో అశ్విన్ అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ అతన్ని సౌతాఫ్రికా పర్యటనలోని టెస్ట్‌ సిరీస్‌కు ఎంపిక చేయకపోవచ్చని స్టీవ్ హార్మిసన్ అభిప్రాయపడ్డాడు. అశ్విన్‌ ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినా ఇంగ్లండ్‌ పర్యటనలో టీమ్‌మేనేజ్‌మెంట్ అతన్ని పక్కనపెట్టిందని హార్మిసన్‌ గుర్తుచేశాడు. 'జట్టు ఎంపికలో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిర్ణయాలే కీలకం. కానీ అతను ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరికి అర్థం కాదు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాలు శతకాలు బాదారు. దీంతో వారిద్దరూ ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లొచ్చని అనుకోవచ్చు. పక్కనపెట్టవచ్చు.

జడేజా కీలక ఆటగాడే..

జడేజా కీలక ఆటగాడే..

అలాగే దారుణంగా విఫలమైన అజింక్యా రహానే, పుజారాలను తుది జట్టులోకి తీసుకున్నా.. అశ్విన్‌ను పక్కనపెట్టినా.. నేను పెద్దగా ఆశ్చర్యపోను. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కోహ్లీకి కొత్తకాదు. గత ఇంగ్లండ్ పర్యటనలో మనం చూశాం. రవీంద్ర జడేజా కీలక ఆటగాడే.

అక్షర్‌, అశ్విన్‌ లాంటి స్పిన్నర్లు బ్యాటింగ్‌ చేయగలిగినా.. జడేజానే ఏడో స్థానంలో సరైన బ్యాట్స్‌మన్‌. కాకపోతే.. అశ్విన్‌‌ను కచ్చితంగా తుది జట్టులో ఉండాలి. ఎందుకంటే అతను సీమ్‌ బౌలర్లకు ఏమాత్రం తక్కువ కాదు."'అని ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

పిచ్‌కు అనుగుణంగా టీమ్..

పిచ్‌కు అనుగుణంగా టీమ్..

సౌతాఫ్రికా పిచ్‌లు పూర్తిగా పేస్‌కు అనుకూలం కాబట్టి భారత్ ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్ వ్యూహారంతో బరిలోకి దిగవచ్చు. లేదంటే నలుగురు పేసర్లు ఓ స్పిన్నర్‌ను ఎంపిక చేయవచ్చు. ఇంగ్లండ్‌లో కూడా నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్ ఫార్మూలనే టీమిండియా ఫాలో అయ్యింది. ఈ క్రమంలోనే అశ్విన్ కాదని బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన జడేజాకే తొలి ప్రాధాన్యత దక్కింది.

సౌతాఫ్రికా పర్యటనలో కూడా ఇదే రిపీట్ కావచ్చు. పిచ్ అనుకూలంగా జట్టు ఎంపిక చేయాల్సిందే. మూస పద్దతిలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఎదురైన పరాభావం వెక్కిరిస్తుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సౌతాఫ్రికా పర్యటనలో తుది జట్టు ఎంపిక తీవ్ర చర్చనీయాంశంకానుంది.

 షెడ్యూల్‌లో చిన్న మార్పు!

షెడ్యూల్‌లో చిన్న మార్పు!

సోమవారం దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్​లో మార్పు చేశారు. ఇంతకుముందు ప్రకారం డిసెంబరు 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో టీమిండియా పర్యటన కాస్త ఆలస్యమయింది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వాయిదా వేసారు.

Story first published: Tuesday, December 7, 2021, 13:29 [IST]
Other articles published on Dec 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X