న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గణాంకాలు: 12 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడిన షోయబ్ మాలిక్

Stats: Shoaib Malik features in a World Cup game after 12 years

హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన నమోదు చేయడంతో ఇంగ్లాండ్‌తో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు మేనేజ్‌మెంట్ రెండు మార్పులతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హారిస్ సోహైల్, ఇమాద్ వసీం స్థానాల్లో షోయబ్ మాలిక్, అసిప్ అలీలు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మార్పుతో అసిఫ్ అలీ తన తొలి వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడగా... సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2007 తర్వాత వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడాడు. 2007, మార్చి 21న జింబాబ్వేతో తన చివరి వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడిన షోయబ్‌ మాలిక్ తిరిగి 12 ఏళ్ల 74 రోజుల తర్వాత ఈ మెగా టోర్నీలో మ్యాచ్ ఆడాడు.

షోయబ్ మాలిక్‌కు ఆఖరి వరల్డ్‌కప్

షోయబ్ మాలిక్‌కు ఆఖరి వరల్డ్‌కప్

2011, 2015 వరల్డ్‌కప్ జట్టులో షోయబ్ మాలిక్ చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ షోయబ్ మాలిక్‌కు ఆఖరి వరల్డ్ కప్ కావొచ్చు. మాలిక్ సైతం ఈ వరల్డ్‌కప్ తర్వాత తాను పరిమిత ఓవర్ల ఫార్మాట్ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించాడు.

అత్యధిక విరామం తీసుకున్న రెండో ఆటగాడిగా

అత్యధిక విరామం తీసుకున్న రెండో ఆటగాడిగా

ఈ నేపథ్యంలో ఆఖరి అవకాశంగా సెలక్టర్లు ఈ వరల్డ్‌కప్‌లో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో అత్యధిక విరామం తీసుకున్న రెండో ఆటగాడిగా షోయబ్ మాలిక్‌ అరుదైన గుర్తింపు పొందాడు. వెస్టిండిస్‌కు చెందిన ఆండర్సన్‌ కమిన్స్‌ 14 ఏళ్ల 362 రోజుల తర్వాత మ్యాచ్‌ ఆడాడు.

అగ్రస్థానంలో ఆండర్సన్ కమ్మిన్స్

అగ్రస్థానంలో ఆండర్సన్ కమ్మిన్స్

ఆ తర్వాత ఆండర్సన్‌ కమిన్స్‌ కెనడా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, ఒకే జట్టు నుంచి సుదీర్ఘ విరామాన్ని లెక్కిస్తే మాత్రం షోయబ్‌ మాలిక్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంటాడు. ఇంగ్లాండ్ పాస్ట్ బౌలర్ లియాం ప్లంకెట్ కూడా 12 ఏళ్ల 39 రోజుల తర్వాత ఈ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

రెండు వరల్డ్‌కప్‌ల మధ్యలో ఎక్కువ గ్యాప్ తీసుకున్న ఆటగాళ్లు:

రెండు వరల్డ్‌కప్‌ల మధ్యలో ఎక్కువ గ్యాప్ తీసుకున్న ఆటగాళ్లు:

ఆండర్సన్ కమ్మిన్స్ - వెస్టిండిస్/కెనడా - 14 ఏళ్ల 362 రోజులు

షోయబ్ మాలిక్ - పాకిస్థాన్ - 12 ఏళ్ల 74 రోజులు

లియాం ప్లంకెట్ - ఇంగ్లాండ్ - 12 ఏళ్ల 39 రోజులు

లామెక్ ఆన్యాంగో - కెన్యా - 11 ఏళ్ల 14 రోజులు

కార్ల్ హూపర్ - వెస్టిండిస్ - 10 ఏళ్ల 328 రోజులు

Story first published: Tuesday, June 4, 2019, 12:05 [IST]
Other articles published on Jun 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X