న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశ్వవిజేతగా నిలిచిన 10 రోజులకే: టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లాండ్ చెత్త రికార్డు

Stats: England tumble to 85 against Ireland in a mad-rush opening day at the Lord’s

హైదరాబాద్: 10 రోజుల క్రితం ఏ గ్రౌండ్‌లో అయితే ఇంగ్లాండ్ వన్డే ప్రపంచకప్ గెలిచిందో అదే గ్రౌండ్‌లో ఊహించని భారీ షాక్ తగిలింది. బుధవారం లార్డ్స్ వేదికగా ప్రారంభమైన ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ చేతిలో 23.4 ఓవర్లలో 85పరుగులకే ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ఆలౌటైంది.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ఐర్లాండ్ బౌలర్లలో టిమ్ ముర్టాగ్(5/13) సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మన్ కనీసం రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. బెయిర్‌స్టో, అలీ, మార్క్ వుడ్‌లు డకౌట్‌గా వెనుదిరిగారు.

జోయ్ డెన్లీ చేసిన 23 పరుగులే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో అత్యధికం. మరో ఐర్లాండ్ బౌలర్ మార్క్ ఆదిర్(3/32) కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 207 పరుగులకు ఆలౌటై.. 122 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఖాతాలో పలు చెత్త రికార్డులు నమోదయ్యాయి.

అవేంటో ఒక్కసారి చూద్దాం..:

23.4 ఓవర్లకే ఆలౌట్

23.4 ఓవర్లకే ఆలౌట్

23.4 - ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 23.4 ఓవర్లకే ఆలౌటైంది. స్వదేశంలో టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు ఇదే అతి తక్కువ ఇన్నింగ్స్. అంతకముందు 1995లో బర్మింగ్ హామ్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన టెస్టులో 30 ఓవర్లకు గాను 89 పరుగులకే ఆలౌటైంది. అంతేకాదు ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది ఐదో అతి తక్కువ ఇన్నింగ్స్.

అతి తక్కువ పరుగులు

అతి తక్కువ పరుగులు

13 - ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఐర్లాండ్ బౌలర్ ఇచ్చిన పరుగులు. ఇంగ్లాండ్‌లో ఓ పర్యాటక బౌలర్ సమర్పించుకున్న అతి తక్కువ పరుగులు ఇవే కావడం విశేషం. 1975లో బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా పేసర్ డెన్నిస్ లిల్లీ (5/15) ప్రదర్శనే అత్యుత్తమం.

టెస్టుల్లో 5 వికెట్లు

టెస్టుల్లో 5 వికెట్లు

37y 356d - టిమ్ ముర్టాగ్ ప్రస్తుత వయసు. టెస్టుల్లో 5 వికెట్లు తీసిన 11వ ఓల్డెస్ట్ ప్లేయర్‌గా టిమ్ ముర్టాగ్ అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు 21వ శతాబ్దంలో 36 ఏళ్లు దాటిన తర్వాత టెస్టుల్లో 5 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 1993 తర్వాత ఏకైక బౌలర్.

తొలిరోజు మూడో ఇన్నింగ్స్

తొలిరోజు మూడో ఇన్నింగ్స్

1951 - టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిరోజు మూడో ఇన్నింగ్స్ ప్రారంభమవడం 1951 తర్వాత ఇదే మొదటిసారి. అడిలైడ్ ఓవల్ వేదికగా 1951, డిసెంబర్‌లో వెస్టిండిస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిరోజే మూడో ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. లార్డ్స్‌లో జరగడం ఇది ఏడోసారి కావడం విశేషం. అంతేకాదు ఓపెనింగ్ డే టెస్టులో 20 వికెట్లు పడటం ఇది 12వసారి.

43 పరుగులకే 7 వికెట్లు

43 పరుగులకే 7 వికెట్లు

43/7 - ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. స్వదేశంలో అతి తక్కువ పరుగులకే ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోవడం ఇది రెండోసారి. 1888లో ఇదే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగులకు గాను 7 వికెట్లు కోల్పోయింది.

Story first published: Thursday, July 25, 2019, 15:33 [IST]
Other articles published on Jul 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X