న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

292 రన్స్ తేడాతో విజయం: లిస్ట్-ఏ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బీహార్

Stats: Bihar defeat Sikkim by a record 292-run margin in the Vijay Hazare Trophy

హైదరాబాద్: విజయ్ హాజారే ట్రోఫీలో భాగంగా ఆదివారం బీహార్-సిక్కిం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. ఆనంద్‌లోని శాస్త్రి మైదాన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సిక్కిం తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

అఫ్రిదితో వెల్లడి: సెహ్వాగ్‌ను భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా?అఫ్రిదితో వెల్లడి: సెహ్వాగ్‌ను భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా?

మూడో స్ధానంలో క్రీజులోకి వచ్చిన బీహార్ బ్యాట్స్‌మెన్ రహమత్ ఉల్హా 53 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత మరో 25 బంతుల్లోనే సెంచరీని సాధించాడు. ఆ తర్వాత మరో 17 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో రహమత్ ఉల్హా మొత్తం 103 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 156 పరుగులు చేసి రైటర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. తద్వారా లిస్ట్-ఏ క్రికెట్‌లో 95 బంతుల్లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రహమత్ అరుదైన ఘనత సాధించాడు.

Stats: Bihar defeat Sikkim by a record 292-run margin in the Vijay Hazare Trophy

2010/11 సీజన్‌లో దినేశ్ కార్తీక్ కేవలం 80 బంతుల్లో 150 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత 2011/12 సీజన్‌లో బెంగాల్‌కు చెందిన లక్ష్మీ రతన్ శుక్లా 95 బంతుల్లో 150 పరుగులు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

తాజాగా రహమత్ ఈ రికార్డుని సమం చేశాడు. తద్వారా లక్ష్మీ రతన్ శుక్లాతో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో రహమత్ సెంచరీతో చెలరేగడంతో బీహార్ 6 వికెట్లు కోల్పోయి 338 పరుగులతో భారీ స్కోరు నమోదు చేసింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సిక్కిం జట్టు కేవలం 46 పరుగులకే కుప్పకూలడంతో బీహార్ జట్టు 292 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిక్కిం జట్టు నమోదు చేసిన 46 పరుగులు లిస్ట్-ఏ క్రికెట్‌లో మూడో అత్యల్ప స్కోరు కావడం విశేషం.

50కిపైగా తక్కువ పరుగులు చేయడం ఇది ఐదోసారి. తాజా విజయంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన టాప్-10 జట్లలో బీహార్ చోటు దక్కించుకుంది. 2017/18 విజయ్ హాజార్ ట్రోఫీలో బరోడా జట్టు అస్సాంపై గెలిచిన 279 పరుగులే ఇప్పటివరకు అత్యధికం.

Story first published: Monday, October 1, 2018, 17:56 [IST]
Other articles published on Oct 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X