న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Srilanka Test Squad: పనిలో పనిగా ఆసీస్ మీద టెస్ట్ సిరీస్ గెలిచేద్దామని పటిష్ట టీంను ప్రకటించిన శ్రీలంక

Srilanka Cricket Board Announced Test Squad For series with Australia

30ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక వన్డే సిరీస్ విజయం సాధించిన తర్వాత శ్రీలంక జట్టు.. ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. ఇక ఈ రెండు టెస్టుల కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు.. 18మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వన్డే సిరీస్‌లో శ్రీలంక విజయం క్రీడాకారుల స్ఫూర్తిని పెంచడమే కాకుండా.. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మరియు రాజకీయ సంక్షోభాల నడుమ అభిమానులకు చాలా అవసరమైన ఆనందాన్నిచ్చింది. ఇక వన్డే సిరీస్‌లోని పాజిటివ్ విషయాలను టెస్ట్ సిరీస్‌లో కూడా చూపాలని శ్రీలంకన్ క్రికెటర్లు భావిస్తున్నారు. ఈ సిరీస్‌లోని తొలి టెస్టు జూన్ 29న గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది.

కెప్టెన్‌గా దిముత్ కరుణరత్నే

కెప్టెన్‌గా దిముత్ కరుణరత్నే

గత నెలలో బంగ్లాదేశ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్లో అద్భుతమైన విజయం తర్వాత మళ్లీ దిముత్ కరుణరత్నే టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ వహించనున్నాడు. ఇక ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో చాలా పొదుపుగా బౌలింగ్ చేసిన జెఫ్రీ వాండర్సే కూడా టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్లో అతను అరంగేట్రం చేయడం ఖాయంగా కన్పిస్తోంది.

 శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించిన టెస్ట్ జట్టు

శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించిన టెస్ట్ జట్టు

దిముత్ కరుణరత్నే (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, ఓషద ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, కమిందు మెండిస్, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), దినేష్ చండిమాల్ (వికెట్ కీపర్), రమేష్ మెండిస్, చమిక కరుణరత్నన్, కసున్ రజిత, విశ్వ ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, దిల్షన్ మదుశంక, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్దేనియా, జెఫ్రీ వాండర్సే

స్టాండ్‌బై ప్లేయర్స్- దునిత్ వెల్లలాగే, లక్షిత రసంజనా

ప్రస్తుతం అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

ప్రస్తుతం అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతుంది. ఇక శ్రీలంకతో జరగబోయే సిరీస్‌లో విజయం సాధించి.. తన నంబర్ 1 స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. కాగా.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న భారత్‌‌‌ను అధిగమించి ఆ స్థానంలోకి వచ్చేందుకు శ్రీలంకకు అవకాశం ఉంది. 2016లో 3-0తో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. శ్రీలంకలో ఆ జట్టును టెస్ట్‌ల్లో ఆడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.

స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ అందుబాటులోకి..

స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ అందుబాటులోకి..

ఇక శ్రీలంక జట్టు వన్డే సిరీస్‌లో విజయం వల్ల చాలా ఉత్సాహంగా కన్పిస్తోంది. వన్డే సిరీస్‌లో గాయపడిన తర్వాత మిచెల్ స్టార్క్, స్టీవెన్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి చేరే అవకాశముండడంతో ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు చాలా బలంగా కన్పిస్తుంది.

జూన్ 29 నుంచి జులై 3 : మొదటి టెస్ట్, గాలె

జులై 8 నుంచి 12 వరకు: రెండవ టెస్ట్, గాలె

Story first published: Saturday, June 25, 2022, 17:28 [IST]
Other articles published on Jun 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X