న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్‌: తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్న లంక క్రికెటర్

Sri Lankan player struck on helmet in warm-up game vs England, stretchered off

హైదరాబాద్: శ్రీలంక క్రికెటర్‌ పాతుమ్‌ నిస్సాంకా తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం శ్రీలంక బోర్డ్‌ లెవన్‌తో ఇంగ్లాండ్‌ జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడే సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పాతుమ్‌ నిస్సాంకా తలకు బంతి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

'రాయుడు అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు''రాయుడు అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు'

రెండు వార్మప్ మ్యాచ్‌లు

రెండు వార్మప్ మ్యాచ్‌లు

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ముందు ఇరు జట్ల మధ్య రెండు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి వార్మప్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ కొట్టిన ఓ బలమైన షాట్‌.. షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న నిస్సాంకా తలకు గట్టిగా తాకడంతో అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు.

స్ట్రెచర్‌పై తీసుకెళ్లిన స్టేడియం నిర్వాహాకులు

స్ట్రెచర్‌పై తీసుకెళ్లిన స్టేడియం నిర్వాహాకులు

వెంటనే అతడిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లిన స్టేడియం నిర్వాహాకులు అనంతరం మెరుగైన చికిత్స కోసం దగ్లర్లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిస్సాంకా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా నిషాన్‌ పైరిస్‌ వేసిన 56వ ఓవర్‌ రెండో బంతిని జోస్‌ బట్లర్‌ భారీ షాట్‌గా ఆడాడు.

ఒక్కసారిగా కుప్పకూలిపోయిన నిస్సాంకా

ఒక్కసారిగా కుప్పకూలిపోయిన నిస్సాంకా

దీంతో ఫైన్‌ లెగ్‌లో ఫీల‍్డింగ్‌ చేస్తున్న నిస్సాంకా హెల్మెట్‌‌కు తగిలడంతో నిస్సాన్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ఎటువంటి ప్రమాదం లేదని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. నిస్సాన్‌ హెల్మెట్‌కు తగిలిన బంతి కాస్తా లెగ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఏంజెలో మాథ్యూస్‌ చేతిలో పడింది.

రిటైర్డ్ హార్ట్‌గా బెన్ స్టోక్స్

రిటైర్డ్ హార్ట్‌గా బెన్ స్టోక్స్

దీని ఫలితంగా జోస్ బట్లర్‌ పెవిలియన్‌‌కు చేరాడు. అంతకముందు ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం టీ విరామం అనంతరం అతడు తిరిగి క్రీజులో అడుగుపెట్టాడు. ఇదిలా ఉంటే రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Story first published: Thursday, November 1, 2018, 12:14 [IST]
Other articles published on Nov 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X