న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మలింగ 'లెగ్' మహిమ: 697 రోజుల తర్వాత మ్యాచ్ గెలిచిన శ్రీలంక

Sri Lanka’s First Win in Internationals in 697 Days With Lasith Malinga in The Playing XI

హైదరాబాద్: కార్ఢిప్ వేదికగా మంగళవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 34 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో వెస్టిండిస్‌ చేతిలో ఘోరంగా ఓడిన శ్రీలంకకు ఈ విజయం కాస్త ఊరటనిచ్చింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ క్రమంలో లసిత్ మలింగ ఉన్న తుది జట్టు 697 రోజుల తర్వాత ఓ అంతర్జాతీయ వన్డేలో విజయం సాధించింది. చివరగా లసిత్ మలింగ ఆడిన జట్టు జులై 2017లో జింబాబ్వేపై వన్డేలో మ్యాచ్ నెగ్గింది. మళ్లీ ఇన్నాళ్లకు శ్రీలంక జట్టు విజయం సాధించింది. మలింగ తుది జట్టులో ఉంటే లంకకు ఏ మాత్రం అచ్చి రాలేదు.

మలింగ ఆడిన వన్డే మ్యాచ్‌ల్లో

గత రెండు సంవత్సరాలుగా మలింగ ఆడిన వన్డే మ్యాచ్‌ల్లో శ్రీలంక ఒకే మ్యాచ్‌లో విజయం సాధించగా 21 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక, టీ20 మ్యాచ్‌ల విషయానికి వస్తే ఈ రికార్డు మరీ దారుణంగా ఉంది. శ్రీలంక ఆడిన ఆరు టీ20ల్లోనూ ఓటమి పాలైంది.

187 పరుగుల లక్ష్య చేధనలో

మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య చేధనలో ఆప్ఘనిస్థాన్ ఆరంభం నుంచి తడబడింది. లంక పేసర్లు విజృంభించడంతో ఆ జట్టు 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. చివర్లో నజిబుల్లా(43), నయిబ్‌ (23) క్రీజులో ఉండటంతో ఆఖరి వరకు ఆప్ఘన్ పోటీలోనే ఉంది.

వర్షం కారణంగా

ఎప్పుడైతే నజిబుల్లా రనౌట్‌ అయ్యాడో ఆ తర్వాత ఆప్ఘన్ కథ ముగిసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ని 41 ఓవర్లలో 187 పరుగులకు కుదించారు. ఆప్ఘన్ జట్టు 32.4 ఓవర్లలో 152 పరుగులకే పరిమితమై 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నబి (4/30), రషీద్‌ఖాన్‌ (2/17) ధాటికి 36.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది.

మ్యాచ్ 41 ఓవర్లకు కుదింపు

ఈ మ్యాచ్‌లో ఆప్ఘన్ బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక 33 ఓవర్లలో 189/8తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో వర్షం కురియడంతో మ్యాచ్‌ కొద్దిసేపు నిలిచిపోయింది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత లంక ఇన్నింగ్స్‌కు 41 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత శ్రీలంక 18 పరుగులే జోడించి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది.

Story first published: Wednesday, June 5, 2019, 13:07 [IST]
Other articles published on Jun 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X