న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంక క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, ఆమోదం తెలిపిన బీసీసీఐ

Sri Lanka Cricket Board official arrested, Arjuna Ranatunga wants Indian help to tackle corruption

న్యూ ఢిల్లీ: క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌, అవినీతి, మోసాలకు పాల్పడకుండా నిబంధనలు రూపొందించేందుకు సాయం అందించాలన్న శ్రీలంక క్రికెట్‌ బోర్డు విజ్ఞప్తిని బీసీసీఐ అంగీకరించింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసుల్లో విచారణకు తమకు సాయం చేయాలని మాజీ కెప్టెన్‌, శ్రీలంక పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ భారత్‌ను కోరారు. శ్రీలంక క్రికెట్‌లో యథేచ్ఛగా ఫిక్సింగ్‌ జరుగుతోందన్న ఆరోపణలపై ఆ దేశ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది.

ఫిక్సింగ్‌లపై విచారణ జరిపేందుకు

ఫిక్సింగ్‌లపై విచారణ జరిపేందుకు

ఈ విచారణలో భారత్‌కు చెందిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సాంకేతిక సహకారం అందించాలని ఆయన అభ్యర్థించారు. ‘ఫిక్సింగ్‌లపై విచారణ జరిపేందుకు నిపుణులైన అధికారులు మాకు లేరు. ఆ సమస్యను నివారించేందుకు అవసరమైన చట్టాలు మా దగ్గర లేవు. ఇందుకు కావాల్సిన చట్టాల రూపకల్పనలో సాయపడేందుకు భారత్‌ సాయం కావాలి' అని రణతుంగ అన్నారు.

టీమిండియా వరుస విజయాలకు బ్రేక్.. విండీస్ విజయం

సమస్యలను పరిష్కరించేందుకు భారత్‌ సాయం

సమస్యలను పరిష్కరించేందుకు భారత్‌ సాయం

క్రికెట్‌లో మోసాలపై విచారణ, దర్యాప్తు జరిపేందుకు భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సాంకేతిక సహాయం అందజేస్తుందని శ్రీలంక పెట్రోలియం శాఖ మంత్రి, మాజీ క్రికెటర్‌ అర్జున రణతుంగ వెల్లడించారు. ‘ఓ క్రమ పద్ధతిలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు మా వద్ద సాధనా సంపత్తి, నిబంధనలు లేవు. చట్టం రూపొందించేందుకు భారత్‌ సాయం చేస్తామని మాటిచ్చింది' అని రణతుంగ తెలిపారు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు

2000 సంవత్సరంలో అర్జున రణతుంగ, మరో క్రికెటర్‌ అరవింద డిసిల్వాపై వచ్చిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు జరిపింది. అందులో వీరిద్దరూ ఎలాంటి తప్పుచేయలేదని తేలింది.అంతర్జాతీయ క్రికెట్‌లో అవినీతిపై మేలో ఓ డాక్యుమెంటరీ ప్రసారం కావడంతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై దర్యాప్తు జరిపేందుకు ఒక ప్రత్యేక పోలీస్‌ విభాగం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.

జయసూర్యపై ఐసీసీ రెండు అభియోగాలు మోపి

జయసూర్యపై ఐసీసీ రెండు అభియోగాలు మోపి

ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌ నాలుగు రోజుల్లో ముగిసేలా చేస్తామని గాలె గ్రౌండ్స్‌మ్యాన్‌ తరంగ ఇండికా, క్రికెటర్‌ తరిందు మెండిస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిని శ్రీలంక క్రికెట్‌ బోర్డు నిషేధించింది. ఐసీసీ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాంతీయ కోచ్‌ కులతుంగపై సైతం నిషేధం పడింది. తమ దర్యాప్తునకు సహకరించడం లేదని దిగ్గజ క్రికెటర్‌ జయసూర్యపై ఐసీసీ రెండు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, October 23, 2018, 11:53 [IST]
Other articles published on Oct 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X