న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PIC: అంబటి రాయుడి జేబులో చేయి పెట్టి ఏదో వెతికిన డేవిడ్ వార్నర్

IPL 2019 : David Warner Searchs In Ambati Rayudu Pocket For Something || Oneindia Telugu
SRH vs CSK: David Warner checking if Ambati Rayudu has 3D glasses in pocket

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా బుధవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో ఓటమి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అనంతరం 133 పరుగుల విజయ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని లేకుండానే చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగింది. ధోనికి విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో సురేశ్ రైనాకు కెప్టెన్సీ అప్పగించింది. చివరగా 2010లో ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది.

ధోని లేకుండా బరిలోకి సీఎస్‌కే

ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంటే... సీఎస్‌కే తరుపున 121 మ్యాచ్‌లు ఆడిన తర్వాత ధోనికి ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు. ధోనికి విశ్రాంతినిచ్చిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడంపై సోషల్ మీడియాలో అభిమానులు జోకులు పేల్చుతున్నారు. 'ధోని లేని సీఎస్‌కే జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లాంటిది' అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

రాయుడు జేబులో చేయి పెట్టి ఏదో వెతికిన వార్నర్

మరోవైపు ఈ మ్యాచ్‌ అనంతరం సన్‌రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.... సీఎస్‌కే ఆటగాడు అంబటి రాయుడు జేబులో చేయి పెట్టి ఏదో వెతికాడు. ఈ ఫోటోని పోస్టు చేస్తూ ఓ నెజిటన్ "రాయుడు ప్యాంట్ జేబులో వార్నర్ 3D కళ్లజోడు కోసం వార్నర్ వెతుకుతున్నాడేమో" అని కామెంట్ పెట్టాడు.

ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో ఓటమి

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 50 (10 ఫోర్లు), జానీ బెయిర్ స్టో 44 బంతుల్లో 61 (3 ఫోర్లు, 3 సిక్సులు) అజేయంగా నిలవడంతో చెన్నైపై అలవోక విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో ఓటమి. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.

డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత

అనంతరం చెన్నై నిర్దేశించిన 133 పరుగుల విజయ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 50 (10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుపున 3000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. పవర్‌ప్లేలో డేవిడ్ వార్నర్‌ దూకుడుగా ఆడాడు. చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొని స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు.

Story first published: Thursday, April 18, 2019, 18:35 [IST]
Other articles published on Apr 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X