న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో బసిల్ థంపి చెత్త రికార్డు: ఇషాంత్ శర్మ రికార్డు బద్దలు

By Nageshwara Rao
SRHs Basil Thampi records most expensive spell in IPL history

హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేసర్ బసిల్ థంపి ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్ని విభాగాల్లో తేలిపోయింది.

గత సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్‌గా అవార్డు అందుకున్న థంపి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసిన థంపి ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు.

* 2018- 70 runs - Basil Thampi v RCB
* 2013- 66 runs - Ishant Sharma v CSK
* 2013- 65 runs - Umesh Yadav v RCB,
* 2014- 65 runs - Sandeep Sharma v SRH

భువీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న థంపి

భువీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న థంపి

గురువారం రాత్రి భువీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న థంపి.. తాను వేసిన నాలుగు ఓవర్లలో 19,18,14,19 పరుగులు ఇచ్చాడు. దీంతో ఐపీఎల్‌లో ఇప్పటికి వరకు ఇషాంత్‌ శర్మ పేరు మీదున్న ఈ చెత్తరికార్డును థంపి బద్దలు కొట్టాడు. 2013లో జరిగిన ఐపీఎల్‌లో ఇషాంత్‌ శర్మ మొత్తం 66 పరుగులిచ్చాడు.

ఇషాంత్ శర్మ రికార్డుని బద్దలు కొట్టిన థంపి

ఇషాంత్ శర్మ రికార్డుని బద్దలు కొట్టిన థంపి

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఇదే అత్యధికం కాగా ఇప్పుడు థంపి ఆ రికార్డుని అధిగమించాడు. ఇషాంత్‌ శర్మ తర్వాత ఉమేశ్‌ యాదవ్‌ (0/65), సందీప్‌ శర్మ(1/65), వరుణ్‌ ఆరోన్‌ (2/63), అశోక్‌ దిండా(0/63)లు అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో ఓటమి కావడం విశేషం.

 218 పరుగులు చేసిన బెంగళూరు

218 పరుగులు చేసిన బెంగళూరు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో డివిలియర్స్‌ (39 బంతుల్లో 69), మొయిన్‌ అలీ (34 బంతుల్లో 65), గ్రాండ్‌హోమ్‌ (17 బంతుల్లో 40) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి 218 పరుగులు భారీ స్కోరు నమోదు చేసింది.

 14 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమి

14 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమి

అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి వరకు పోరాడి 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (42 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), మనీశ్‌ పాండే (38 బంతుల్లో 62 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చివరి వరకు పోరాడినా విజయం బెంగళూరునే వరించింది.

Story first published: Friday, May 18, 2018, 10:28 [IST]
Other articles published on May 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X