న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఫిలాండర్‌!!

South African pacer Vernon Philander retires from all international cricket


జోహానెస్‌బర్గ్‌:
దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్‌ వెర్నన్‌ ఫిలాండర్‌ (34) అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. జోహానెస్‌బర్గ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు ముగిసిన అనంతరం ఫిలాండర్‌ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన అనంతరం రిటైర్‌ అవుతానని గతంలోనే ఫిలాండర్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వెటరన్ పేసర్ వీడ్కోలుతో సీనియర్లు దూరమై ఇప్పటికే సంధి దశలో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది.

దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు జట్టును కొత్త కమిటీ ఎంపిక చేస్తుంది: గంగూలీదక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు జట్టును కొత్త కమిటీ ఎంపిక చేస్తుంది: గంగూలీ

 ఆఖరి టెస్టు చేదు జ్ఞాపకం:

ఆఖరి టెస్టు చేదు జ్ఞాపకం:

వెర్నన్‌ ఫిలాండర్‌ చివరగా ఆడిన టెస్టు అతనికి ఓ చేదు జ్ఞాపకంగానే మిగిలిపోయింది. జట్టును గెలిపించి ఘనంగా వీడ్కోలు పలకాలనుకున్న ఫిలాండర్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. ఐసీసీ తన మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింటును ఖాతాలో చేర్చింది. నాలుగో టెస్టు రెండో రోజు ఇంగ్లండ్ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను ఔట్‌ చేసిన అనంతరం హద్దు మీరి ప్రవర్తించినందుకు ఐసీసీ చర్యలు తీసుకుంది.

టెస్టు స్పెషలిస్ట్‌గా గుర్తింపు:

టెస్టు స్పెషలిస్ట్‌గా గుర్తింపు:

దక్షిణాఫ్రికా పేస్‌ విభాగంలో డేల్‌ స్టెయిన్‌, మోర్నీ మోర్కెల్‌తో పాటు ఫిలాండర్‌ కూడా కీలక పాత్ర పోషించారు. టెస్ట్‌ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాకు ఎక్కువగా ప్రాతినిథ్యం వహించిచారు. ఫిలాండర్‌ టీ20, వన్డేలు ఆడినా కూడా టెస్టు స్పెషలిస్ట్‌గానే ఎక్కువ గుర్తింపు దక్కింది. ఇటీవల కాలంలో గాయాలు వెంటాడుతుండంతో ఫిలాండర్‌ రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.

64 టెస్టులు.. 224 వికెట్లు:

64 టెస్టులు.. 224 వికెట్లు:

ఫిలాండర్‌ దక్షిణాఫ్రికా తరఫున 64 టెస్టులు, 30 వన్డేలు, 7 టీ20లు ఆడారు. టెస్టుల్లో 224 వికెట్లు, వన్డేల్లో 41, టీ20 ఫార్మాట్‌లో నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. తొలి ఏడు టెస్టుల్లోనే 51 వికెట్లు తీసి సత్తా చాటారు. టెస్ట్‌ల్లో 1,779 పరుగులు చేసాడు. 8 హాఫ్ సెంచరీలు సాధించారు. వన్డేలలో 151 పరుగులు చేసారు. అత్యధిక స్కోర్ 30. ఇక 7 టీ20ల్లో 14 పరుగులు చేసారు.

18 నెలల్లో 10 టెస్టులు:

18 నెలల్లో 10 టెస్టులు:

12 ఏళ్ల కెరీర్‌లో సఫారీ టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఫిలాండర్‌.. ఆ దేశం తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. గత 18 నెలల్లో ఫిలాండర్‌ 10 టెస్టులు మాత్రమే ఆడారు. ఇటీవలే ఫిలాండర్‌ ఫిట్‌నెస్‌ను మాజీ కెప్టెన్, దక్షిణాఫ్రికా బోర్డు డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, January 28, 2020, 11:14 [IST]
Other articles published on Jan 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X