న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3వ టీ20లో భారత్ థ్రిల్లింగ్‌ విజయం: సఫారీ గడ్డపై 2-1తో సిరీస్ కైవసం

By Nageshwara Rao
3rd T20: South Africa win the toss, elect to field

హైదరాబాద్: 51 రోజుల సుదీర్ఘ పర్యటనను భారత క్రికెట్‌ జట్టు అద్భుతంగా ముగించింది. టెస్టు సిరీస్ వైఫల్యం నుంచి తేరుకున్న టీమిండియా అటు వన్డేల్లోనూ ఇటు టీ20ల్లోనూ తన సత్తా ఏంటో చూపించింది. ఒకేసారి రెండు సిరీస్‌లను ఒడిసిపట్టుకుని సఫారీ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించింది.

చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన చివరి టీ20లో ఒత్తిడిని జయిస్తూ కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సమష్టిగా పోరాడింది. శనివారం జరిగిన మూడో టీ20లో భారత్ 7 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో డుమిని (41 బంతుల్లో 55; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో జంకెర్ (49) దూకుడుగా ఆడినప్పటికీ జట్టుని గెలిపించలేకపోయాడు.

భారత బౌలర్లలో భువీకి 2, బుమ్రా, ఠాకూర్, పాండ్యా, రైనా తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు ధావన్ (40 బంతుల్లో 47; 3 ఫోర్లు), రైనా (27 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సురేశ్‌ రైనాకు, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ భువనేశ్వర్‌కు దక్కాయి.

రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెన్నునొప్పితో ఈ మ్యాచ్‌కు దూరమవడంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.


సఫారీల విజయ లక్ష్యం 173

కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టీ20లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. దీంతో సఫారీలకు 173 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

కెప్టెన్ రోహిత్ శర్మ 11 పరుగులు మాత్రమే చేసి డాలా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో రైనా (27 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్సు) పరుగుల వద్ద షంసీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత మనీష్ పాండే (13) పరుగులు వద్ద డాలా బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఓపెనర్ శిఖర్ ధావన్ (46) దూకుడుగా ఆడే క్రమంలో అనవరస పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా (21), ధోని (12), కార్తీక్ (13) పరుగులు మాత్రమే చేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో డాలా 3, మోరిస్ 2, షంసీ ఒక వికెట్ తీసుకున్నారు.


టాస్ గెలిచి కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన దక్షిణాఫ్రికా:

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాప్రికా జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 ప్రారంభమైంది. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. గత బుధవారం జరిగిన రెండో టీ20లో ఆతిథ్య దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో మూడు టీ20 సిరిస్ 1-1తో సమం అయింది.

ఈ టోర్నీ విజేత ఎవరో తేల్చే మ్యాచ్ ఆఖరి మ్యాచా కావడంతో సిరిస్ ఆసక్తికరంగా మారింది. మూడో టీ20లో గెలిచి సఫారీ గడ్డపై విజయంతో ముగించాలని కోహ్లీసేన ఊవిళ్లూరుతుండగా... వన్డే సిరిస్‌లో ఎదురైన ఘోర పరాభవానికి టీ20 సిరిస్‌లో బదులు తీర్చుకోవాలని ఆతిథ్య దక్షిణాఫ్రికా భావిస్తోంది. అంతేకాదు ఈ మ్యాచ్‌‌లో పలు రికార్డులు బద్దలు కానున్నాయి.

భారత్ జట్టులో కీలక మార్పులు జరిగాయి. కెప్టెన్ విరాట్‌ కోహ్లి స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ జట్టులోకి రాగా, చాహల్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనాద్కత్‌ స్థానంలో బుమ్రా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మూడో టీ20లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు.

 3rd T20: South Africa win the toss, elect to field

'టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడం వలన ప్రణాళిక ప్రకారం గత మ్యాచ్‌లో విజయం సాధించగలిగాం. దానికి ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలనుకుంటున్నాం' అని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుమిని అన్నాడు. మరోవైపు ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టులో కూడా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. క్రిస్టియన్‌ జాంకర్‌, ఆరోన్‌ ఫాన్‌గిసో తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

జట్ల వివరాలు:
భారత్‌: కోహ్లీ (కెప్టెన్), ధావన్‌, రోహిత్‌ శర్మ, రైనా, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌, ధోని, పాండ్యా, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, భువీ, బుమ్రా, ఉనాద్కత్‌, శార్దూల్‌ ఠాకూర్‌

దక్షిణాఫ్రికా: జేపీ డుమిని (కెప్టెన్), బెహార్డిన్‌, జూనియర్‌ డాలా, రెజీ హెన్రిక్స్‌, క్రిస్ట్రియన్‌, క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, క్రిస్‌ మోరిస్‌, డేన్‌ ప్యాటర్‌సన్, ఆరోన్‌ ఫాంగిసో, ఫెలుక్వాయో, షంసీ, జేజే స్మట్స్‌

Story first published: Sunday, February 25, 2018, 8:19 [IST]
Other articles published on Feb 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X