న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3-1తో సిరిస్ కైవసం: సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా

By Nageshwara Rao
South Africa crush Australia by 492 runs to win series 3-1

హైదరాబాద్: 48 ఏళ్ల తర్వాత సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-1తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఎందుకంటే స్వదేశంలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా టెస్టు సిరిస్‌ను నెగ్గడం ఇదే తొలిసారి.

Australia vs South Africa 2018 4th Test Score Card

జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన నాలుగో దక్షిణాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. 612 పరుగుల భారీ పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా 492 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్‌ 6/21తో రాణించి పర్యాటక ఆసీస్‌ను కోలుకోని దెబ్బకొట్టాడు. దక్షిణాఫ్రికాకు ఇది టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయం కాగా, స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు జరిగిన 7 సిరీస్‌ల అనంతరం టెస్టు సిరిస్‌ను గెలుచుకోవడం ఇదే మొట్టమొదటిసారి.

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఫిలాండర్‌ టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇన్నింగ్స్ 31వ ఓవర్‌ను వేసిన ఫిలాండర్ వీరిద్దరి పెవిలియన్ పంపాడు. తొలి బంతికి 199వ వికెట్‌గా షాన్ మార్ష్, నాలుగో బంతికి 200వ వికెట్‌గా మిచెల్ మార్ష్‌ను ఔట్ చేసి టెస్టు కెరీర్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

సౌతాఫ్రికా తరఫున టెస్టుల్లో ఈ మార్క్‌ను చేరుకున్న ఏడో బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన ఫిలాండర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ లభించగా, ఈ సిరిస్‌లో 23 వికెట్లు తీసిన కగిసో రబాడకు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు లభించింది.

ఈ సిరిస్ ఆరంభం నుంచే అనేక వివాదాలు ఆటగాళ్లను చుట్టుముట్టాయి. తొలి టెస్టులో వార్నర్‌-డికాక్‌ల వాగ్వాదం, రెండో టెస్టులో రబాడ-స్మిత్‌ల గొడవ ప్రపంచ క్రికెట్‌లో చర్చనీయాంశమైంది. ఇక, కేప్ టౌన్ టెస్టులో జరిగిన బాల్‌ టాంపరింగ్ వివాదం ప్రపంచ క్రికెట్‌ను కుదిపేసింది.


అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మోర్నీ మోర్కెల్

దక్షిణాఫ్రికా స్టార్‌ బౌలర్‌ మోర్నె మోర్కెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'కుటుంబ సమస్యల కారణంగా రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాను. అద్భుత సిరీస్‌ విజయంతో నా క్రికెట్‌ కెరీర్‌ ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని మోర్కెల్‌ అన్నాడు. తన చివరి టెస్టులో మోర్కెల్‌కు 3 వికెట్లు తీశాడు.

2006లో డర్బన్‌లో భారత్‌తో జరిగిన టెస్టులో మోర్కెల్‌ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 85 టెస్టులాడిన మోర్కెల్‌ 306 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 117 వన్డేల్లో 188, 44 టీ20ల్లో 47 వికెట్లును దక్కించుకున్నాడు.

ఐపీఎల్‌లో మొదటి మూడు సీజన్లలో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిడు మోర్కెల్‌. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున కూడా ఆడాడు. ఓ సీజన్‌లో 16 మ్యాచుల్లో 25 వికెట్లు తీసి పర్పుల్‌ కాప్‌ను అందుకున్నాడు.

Story first published: Tuesday, April 3, 2018, 16:53 [IST]
Other articles published on Apr 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X