ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలవడం కష్టమే!

Posted By:

హైదరాబాద్: స్వదేశంలో భారత్ చేతిలో వన్డే సిరీస్‌ చేజార్చుకున్న దక్షిణాఫ్రికాపై ఆ జట్టు కోచ్ గిబ్సన్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఆరు వన్డేల సిరిస్‌ను ఇంకో వన్డే మిగిలుండగానే కోహ్లీసేన 4-1తో సిరిస్‌ను చేజిక్కించుకోవడంపై కోచ్ గిబ్సన్‌ను నిరాశకు గురి చేసింది. 2019 వరల్డ్ కప్‌ని లక్ష్యంగా పెట్టుకుని దక్షిణాఫ్రికా జట్టును సిద్ధం చేస్తుంటే.. ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం రోజురోజుకీ తీసికట్టుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.

 ఐదో వన్డేలో పేలవ ప్రదర్శన

ఐదో వన్డేలో పేలవ ప్రదర్శన

అనంతరం లక్ష్య ఛేదనలో సఫారీలు 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటయ్యారు. దీంతో ఆరు వన్డేల సిరీస్‌ని కోహ్లీసేన 4-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గిబ్సన్ మీడియాతో మాట్లాడుతూ 'ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శన మరీ పేలవంగా ఉంది. వచ్చే ఏడాది వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే జట్టు సిద్ధమవుతోందని జట్టులోని ఆటగాళ్లందరికీ తెలుసు' అని అన్నాడు.

 ఇలాంటి జట్టుతో మెగా టోర్నీకి ఎలా వెళ్లగలం?

ఇలాంటి జట్టుతో మెగా టోర్నీకి ఎలా వెళ్లగలం?

'కానీ.. ఆటగాళ్లు మాత్రం తమ ఆటతీరుని మార్చుకోలేదు. ఇలాంటి జట్టుతో మెగా టోర్నీకి ఎలా వెళ్లగలం? భారత జట్టులో ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. అయితే.. వరల్డ్ కప్‌లో వారిని మళ్లీ ఎదుర్కోనేందుకు సఫారీ జట్టు దగ్గర ఏడాది సమయం ఉంది. అయితే, నాకొక విషయం అర్ధం కాలేదు. వరల్డ్ కప్ జరిగే ఇంగ్లాండ్‌లో పిచ్‌లు ఈ మణికట్టు స్పిన్నర్లకి ఇక్కడిలానే అనుకూలిస్తాయా?' అని గిబ్సన్ సందేహం వ్యక్తం చేశాడు.

 దక్షిణాఫ్రికా తీవ్ర ఒత్తిడికి గురైందనేది వాస్తవం

దక్షిణాఫ్రికా తీవ్ర ఒత్తిడికి గురైందనేది వాస్తవం

'ఆరు వన్డేల సిరిస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలుకావడంతో దక్షిణాఫ్రికా తీవ్ర ఒత్తిడికి గురైందనేది వాస్తవం. నాలుగో వన్డేని గెల్చుకున్నప్పుడు, కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఒత్తిడి మాత్రం ఏ మాత్రం తగ్గలేదని ఐదో వన్డేలో ఆడిన తీరే స్పష్టం చేసింది. మొదటి మూడు వన్డేలకు గాయం కారణంగా డివిలియర్స్ అందుబాటులో లేకపోవడం, డుప్లెసిస్, క్వింటన్ డి కాక్ కూడా దూరం కావడం జట్టును కోలుకోలేని దెబ్బతీశాయి' అని అన్నాడు.

సిరీస్ ఓటమికి కారణాలను వెతుక్కోవడం లేదు

సిరీస్ ఓటమికి కారణాలను వెతుక్కోవడం లేదు

సిరీస్ ఓటమికి కారణాలను వెతుక్కోవడం లేదని గిబ్సన్ పేర్కొన్నాడు. ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్ సేవలను ఏదో ఒక దశలో కోల్పోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని, తుది జట్టు కూర్పు చాలా కష్టమవుతుందనే విషయం తెలిసిందేనని అన్నాడు. ఇక, భారత్ వంటి అత్యంత బలమైన జట్టును ఢీకొనే సమయంలో గాయాల సమస్య తలెత్తడం దురదృష్టకరమని అన్నాడు. ఈ సిరిస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడాడు.

Story first published: Thursday, February 15, 2018, 12:26 [IST]
Other articles published on Feb 15, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి