న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరుద్ధ ప్రయోజనాల అంశం ఎఫెక్ట్: సీఏసీకి గంగూలీ రాజీనామా!

 Sourav Ganguly willing to resign from Cricket Advisory Committee to avoid conflict

హైదరాబాద్: క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)కి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజీనామా చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినవిస్తోంది. ఒకవైపు క్యాబ్‌ అధ్యక్షుడిగా మరోవైపు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు సలహాదారుగానూ వ్యవహరిస్తుండటంతో.. గంగూలీకి పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అభిమాని ఫిర్యాదుకు స్పందించిన అంబుడ్స్‌మన్‌.. ఇప్పటికే సౌరవ్ గంగూలీకి నోటీసులు జారీ చేసి తన ముందు నేరుగా హాజరు కావాలని ఆదేశించారు. దీంతో శనివారం బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ముందు గంగూలీ హాజరు కానున్నాడు. దీంతో గంగూలీ ఈ రెండింటిలో ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

సీఏసీ పదవికి గంగూలీ రాజీనామా

సీఏసీ పదవికి గంగూలీ రాజీనామా

ఈ క్రమంలో క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) పదవికి రాజీనామా చేయాలని గంగూలీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)లో సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సూచన మేరకే టీమిండియా హెడ్ కోచ్‌ను ఎంపిక చేస్తారు. ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత తొలుత అనిల్ కుంబ్లేని, ఆ తర్వాత రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా ఎంపిక చేసింది.

ఇదే కమిటీలో సభ్యులుగా సచిన్, లక్ష్మణ్

ఇదే కమిటీలో సభ్యులుగా సచిన్, లక్ష్మణ్

ఇదే కమిటీలో సభ్యులుగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకు సచిన్‌ టెండూల్కర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్‌ సలహాదారులుగా కొనసాగుతున్నారు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభానికి ముందు సలహాదారుగా నియమించుకుంది.

క్యాబ్‌ పదవిలో ఉంటూ.. ఐపీఎల్‌ జట్టుకు సలహాదారుగా

క్యాబ్‌ పదవిలో ఉంటూ.. ఐపీఎల్‌ జట్టుకు సలహాదారుగా

దీంతో క్యాబ్‌ పదవిలో ఉంటూ.. ఐపీఎల్‌ జట్టుకు సలహాదారుగా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందంటూ గంగూలీపై అభిమానులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు స్వీకరించిన అంబుడ్స్‌మన్‌ గుంగూలీకి నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు గంగూలీ చివరగా 2017లో ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా ఎంపిక చేసిన సమయంలో నిర్వహించిన సీఏసీ సమావేశానికి హాజరయ్యాడు. ఆ తర్వాత సీఏసీతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

శనివారం అంబుడ్స్‌మన్‌ ముందు గంగూలీ

శనివారం అంబుడ్స్‌మన్‌ ముందు గంగూలీ

దీంతో గంగూలీ ఏమైనా చెప్పాలనుకుంటే అంబుడ్స్‌మన్‌ ముందు చెప్పుకోవచ్చని ఆయన సూచించారు. కాగా, గంగూలీ ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కొనసాగాలని నిర్ణయించుకుంటే సీఏసీకి దూరం కావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతం దాదా ఢిల్లీకి సలహాదారుగా ఉంటూ క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Story first published: Wednesday, April 17, 2019, 18:09 [IST]
Other articles published on Apr 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X