న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత క్రికెట్‌ను మార్చేసిన ఆటగాడు గంగూలీ.. గొప్ప నాయకుడు!!

Sourav Ganguly Transformed Indian Cricket, He is a great leader Says Shoaib Akhtar

లాహోర్‌: భారత క్రికెట్‌ను మార్చేసిన ఆటగాడు సౌరభ్‌ గంగూలీ. టీమిండియా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న దశలో జట్టు స్వరూపాన్నే మార్చేశాడు. దాదాకు ఆటపై అత్యున్నత అవాగాహన ఉంది. అతడో గొప్ప నాయకుడు అని పాకిస్థాన్‌ మాజీ పేస్ బౌలర్ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. భారత జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఈనెల 23న బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా కీలక బాధ్యతలను చేపట్టబోతున్నాడు. తన గురువు జగ్మోహన్‌ దాల్మియా అధిష్టించిన స్థానంలో దాదా పది నెలల పాటు పదవిలో ఉండబోతున్నాడు.

<strong>ప్రస్తుత సవాళ్లు భవిష్యత్తులో కూడా ఎదురవుతాయి.. అందుకు సిద్ధంగా ఉన్నా!!</strong>ప్రస్తుత సవాళ్లు భవిష్యత్తులో కూడా ఎదురవుతాయి.. అందుకు సిద్ధంగా ఉన్నా!!

 కెప్టెనయ్యేవరకు అలా అనుకోలేదు

కెప్టెనయ్యేవరకు అలా అనుకోలేదు

బీసీసీఐ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు చేపట్టబోతున్న గంగూలీని పలువురు ప్రముఖులు అభినందించారు. భారత మాజీలతో సహా ఇతర దేశాల మాజీలు కూడా అభినందిస్తున్నారు. తాజాగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా దాదాను కొనియాడాడు. అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'భారత క్రికెట్‌ను మార్చిన ఒక వ్యక్తి సౌరవ్ గంగూలీ. 97-98కి ముందు పాకిస్థాన్‌ని టీమిండియా ఓడిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. గంగూలీ కెప్టెన్ అయ్యే వరకు పాకిస్థాన్‌ను ఓడించే సత్తా టీమిండియాకు ఉందని నేను ఎప్పుడూ అనికోలేదు' అని అన్నాడు.

గొప్ప నాయకుడు

గొప్ప నాయకుడు

'సౌరవ్ గంగూలీ భారత ఆటగాళ్లు ఆలోచించే విధానాన్నే మార్చేశాడు. భారత్‌ కోసం అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొచ్చాడు. ఎందరో ఆటగాళ్లకు కెరీర్ అందించాడు. అతడో గొప్ప నాయకుడు. ఆటగాళ్లలో నైపుణ్యాన్ని వెతికితీయడంలో అతడు నిజాయతీపరుడు. గంగూలీకి క్రికెట్‌పై అత్యుత్తమ అవగాహన ఉంది' అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఏకైక వ్యక్తి గంగూలీ. దాదా అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

అధ్యక్ష పదవిలో పది నెలలు

అధ్యక్ష పదవిలో పది నెలలు

కొత్త నిబంధనల ప్రకారం గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవిలో పది నెలల పాటు (సెప్టెంబర్ 2020) కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం కోల్‌కతా క్రికెట్ బోర్డు (క్యాబ్) అధ్యక్షుడిగా దాదా కొనసాగుతున్నాడు. ఈనెల 23న బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాక క్యాబ్ పదవిని దాదా వదిలేయనున్నాడు.

2008లో రిటైర్మెంట్

2008లో రిటైర్మెంట్

గంగూలీ కెరీర్‌లో 113 టెస్ట్‌లు, 311 వన్డేలు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన గంగూలీ కెరీర్‌.. 1996లో టెస్ట్‌ల్లో ఆడడం ప్రారంభించాక కొత్త శిఖరాలకు చేరింది. 2000 నుంచి 2005 వరకు భారత సారథిగా వ్యవహరించిన దాదా.. 2008లో ఆటకు వీడ్కోలు పలికాడు. 2003లో టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్లోకి తీసుకెళ్లాడు. రిటైర్మెంట్ అనంతరం కొద్ది సీజన్ల పాటు ఐపీఎల్‌లో ఆడాడు. ఇక 2015లో తొలిసారి క్యాబ్‌ చీఫ్‌గా ఎన్నికైన గంగూలీ ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో ఉన్నాడు.

Story first published: Wednesday, October 16, 2019, 12:39 [IST]
Other articles published on Oct 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X