న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లారా, విలియమ్సన్‌లా గొప్ప బ్యాట్స్‌మన్ అవుతాడు: గిల్‌కు దాదా కితాబు

By Nageshwara Rao
Sourav Ganguly thinks Shubman Gill resembles Lara and Williamson

హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్‌-19 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన శుభమాన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభమాన్ గిల్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.

మైదానం బయట శుభమాన్ గిల్ భలే చిలిపిపనులు చేస్తాడుమైదానం బయట శుభమాన్ గిల్ భలే చిలిపిపనులు చేస్తాడు

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ 'ప్రస్తుత అండర్‌-19 జట్టు కెప్టెన్‌గా ఉన్న పృథ్వీ షా కంటే గిల్‌ మెరుగైన ఆటగాడు అని నేను అనుకుంటున్నాను. జట్టులో అత్యుత్తమ ఆటగాడు. బ్రియాన్‌ లారా, కేన్‌ విలియమ్స్‌న్‌లా భవిష్యత్తులో గిల్‌ గొప్ప బ్యాట్స్‌మన్ అవుతాడు' అని అన్నాడు.

'తన ఆట తీరుతో యావత్తు క్రికెట్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటాడు. బెంగాల్‌ తరఫున ఆడిన ఇషాన్‌‌ పొరెల్‌ కూడా కొత్త బంతితో అద్భుతాలు చేస్తున్నాడు. టోర్నీ ప్రారంభంలో అతడు గాయపడ్డాడు. వారం తర్వాత జట్టులోకి వచ్చిన అతడు అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మిగతా వారితో పోలిస్తే వీరిద్దరూ చాలా ప్రత్యేకం' అని దాదా అన్నాడు.

'ఇక, వికెట్‌ కీపర్‌ హార్విక్‌ దేశాయ్‌ కూడా టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణిస్తున్నాడు. వీరు ముగ్గురూ త్వరలో అద్భుతాలు చేయొచ్చు. భవిష్యత్తులో భారత క్రికెట్‌ వీరి చుట్టూ తిరిగిన ఆశ్చర్య పోవాల్సిన అవసం లేదు. ఈ టోర్నీలో మన జట్టుకు మిగతా జట్లకు చాలా వ్యత్యాసం ఉంది' అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

కోహ్లీసేనకు బ్యాడ్ న్యూస్: డర్బన్‌లో గెలుపు రుచిచూడని టీమిండియాకోహ్లీసేనకు బ్యాడ్ న్యూస్: డర్బన్‌లో గెలుపు రుచిచూడని టీమిండియా

అండర్-19 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న శుభమాన్ గిల్ గత ఆరు ఇన్నింగ్స్‌ల్లోనూ వరుసగా 147, 66, 63, 90, 86, 102 పరుగులు చేయడం విశేషం. టోర్నీలో భాగంగా పాక్‌తో మంగళవారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో శుభమాన్ గిల్ (102 నాటౌట్)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అనంతరం 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ భారత బౌలర్ల దెబ్బకు 29.3 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. టోర్నీలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 3)న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 31, 2018, 20:04 [IST]
Other articles published on Jan 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X