న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రహానెను తప్పించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న గంగూలీ..!!

Sourav Ganguly Surprised By Ajinkya Rahanes Absence From The Limited- Overs Squads Against England

హైదరాబాద్: ఐపీఎల్‌ అనంతరం టీమ్‌ ఇండియా.. ఇంగ్లాండ్, ఐర్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్, అఫ్గానిస్థాన్‌తో ఒక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ఈ సిరీస్‌కు సంబంధించి మంగళవారం జట్టుకు ఎంపికైన ఆటగాళ్ల జాబితాను వెల్లడించింది.

 ఏకైక టెస్ట్‌కు అజింక్య రహానె

ఏకైక టెస్ట్‌కు అజింక్య రహానె

ఐపీఎల్‌లో విశేషంగా రాణిస్తున్న అంబటి రాయుడు, కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌, సిద్ధార్థ్‌ కౌల్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఇక వచ్చే నెల జూన్‌లో అఫ్గానిస్థాన్‌తో ఆడనున్న ఏకైక టెస్ట్‌కు అజింక్య రహానె నాయకత్వం వహించనున్నాడు.

 అశ్చర్యానికి లోనయ్యా: గంగూలీ

అశ్చర్యానికి లోనయ్యా: గంగూలీ

సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేను తప్పించడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అశ్చర్యానికి లోనయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు కెప్టెన్సీ వహించనున్న రహానేకు అనూహ్యంగా వన్డే, టీ20 మ్యాచ్‌ల నుంచి తప్పించారు. ఇంగ్లండ్‌తో వన్డేలకు శ్రేయస్ అయ్యర్, సిద్ధార్త్ కౌల్, అంబటి రాయులకు పిలుపు రాగా రహానే లాంటి ఆటగాడిని పక్కన పెట్టడాన్ని గంగూలీ జీర్ణించుకోలేక పోతున్నాడు.

 నాకు అవకాశం ఇస్తే కచ్చితంగా రహానేను

నాకు అవకాశం ఇస్తే కచ్చితంగా రహానేను

బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఎంతో కఠినమైనదని అభివర్ణించాడు. జాతీయ మీడియా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇస్తే, రాయుడు కంటే ముందుగా కచ్చితంగా రహానేను తీసుకుంటాను. ఇంగ్లండ్ లాంటి దేశాల్లో ఆడిన అనుభవం రహానే సొంతం. ఇంగ్లండ్‌లో రహానేకు మంచి రికార్డ్ ఉంది. రహానేను తప్పించడం కఠిన నిర్ణయని' అభిప్రాయపడ్డాడు.

నామమాత్రంగా రాణిస్తున్న రహానె:

నామమాత్రంగా రాణిస్తున్న రహానె:

మరోవైపు ఇదే ఇంగ్లాండ్‌ సిరీస్‌కు శ్రేయాస్‌ అయ్యర్‌ ఎంపికను గంగూలీ సమర్థించాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నైకు ఆడుతున్న రాయుడు మొత్తం ఆడిన 10 మ్యాచ్‌లలో 423 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్సీ వహిస్తున్న రహానె ఈ సీజనులో నామమాత్రంగా రాణిస్తున్నాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లోనూ 90 మ్యాచ్‌లాడిన రహానె 35 సగటుతో 2962 పరుగులు చేశాడు.

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కి టీమిండియా:

విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్

ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌‌‌కి టీమిండియా:

విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, చాహల్; కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్

Story first published: Wednesday, May 9, 2018, 17:01 [IST]
Other articles published on May 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X