న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తరానికి తగ్గట్టు ఆడేవాడిని.. టీ20 కోసం నా బ్యాటింగ్‌ మార్చుకునేవాడిని: గంగూలీ

Sourav Ganguly says Would have loved to play more T20 cricket

కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తనకు టీ20 క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టమని తెలిపాడు. పొట్టి ఫార్మాట్‌లో హిట్టింగ్‌ చేసేందుకు అవకాశముంటుందని, అందుకే తాను ఆ ఫార్మాట్‌ ఆడేందుకు ఇష్టపడేవాడినని చెప్పాడు. తాను ఈ తరంలో ఆడి ఉంటే.. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా తన ఆటను మార్చుకొనే వాడినని దాదా తెలిపాడు. మూడు ఫార్మాట్‌లలో గంగూలీ టీ20 క్రికెట్‌కు మద్దతుగా మాట్లాడాడు.

పొట్టి ఫార్మాట్‌ నాకిష్టం:

పొట్టి ఫార్మాట్‌ నాకిష్టం:

టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌తో ఆదివారం లైవ్‌లో పాల్గొన్న సౌరవ్ గంగూలీ తనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. 'టీ20లు ఎంతో కీలకం. ఇప్పటి తరంలో ఆడాల్సి వస్తే నా ఆటను కచ్చితంగా మార్చుకొనేవాడిని. ఎందుకంటే.. ఈ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మన్‌ ఇష్టం వచ్చినట్టు బాదొచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఆడిన ఐదేళ్ల పాటు పొట్టి ఫార్మాట్‌ను ఆస్వాదించా. మరింతకాలం ఆడితే బావుండు అనిపిస్తోంది' అని గంగూలీ చెప్పాడు. దాదా భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో 59 మ్యాచ్‌లు ఆడాడు.

నియంత్రణలో లేకుండా సంబురాలు చేసున్నాం:

నియంత్రణలో లేకుండా సంబురాలు చేసున్నాం:

2002 నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్‌ సంబరాలను సౌరవ్ గంగూలీ గుర్తు చేసుకున్నాడు. భారత్‌ ఆ మ్యాచ్‌లో 326పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాక కెప్టెన్‌గా ఉన్న దాదా లార్డ్స్‌ బాల్కనీలో చొక్కా విప్పి సంబురాలు చేసుకున్న సంగతి తెలిసిందే. 'అదో అద్భుతమైన సందర్భం. అందరం నియంత్రణలో లేకుండా సంబురాలు చేసున్నాం. క్రీడల్లో ఇదంతా మామూలే. అలాంటి మ్యాచ్‌ గెలిచినప్పుడు.. మరింత ఎక్కువగా సంబురాలు చేసుకుంటాం' అని దాదా చెప్పాడు. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా వన్డేలు,టెస్టుల్లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను దాదా టీమిండియాకు అందించాడు.

ఆ ముగ్గురిని ఎంచుకుంటా:

ఆ ముగ్గురిని ఎంచుకుంటా:

2019 ప్రపంచకప్‌ జట్టులోని ఆటగాళ్లలో ముగ్గురిని 2003 విశ్వటోర్నీకి తీసుకోవాల్సి వస్తే ఎవరిని ఎంపిక చేసుకుంటారనే ప్రశ్నకు సౌరవ్ గంగూలీ సమాధానమిచ్చాడు. ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, స్పీడ్‌ స్టర్‌ జస్పీత్‌ బుమ్రాను తీసుకుంటానన్నాడు. నాలుగో ప్లేయర్‌ను ఎంపిక చేసుకునేందుకు కూడా చాన్స్‌ ఇస్తే.. మాజీ కెప్టెన్, వికెట్ కీపర్‌ ఎంఎస్‌ ధోనీని ఎంచుకుంటానని గంగూలీ అన్నాడు.

భారత్ తరఫున 311 వన్డేలు, 113 టెస్టులు:

భారత్ తరఫున 311 వన్డేలు, 113 టెస్టులు:

బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ తన కెరీర్‌లో మొత్తం భారత్ తరఫున 311 వన్డేలు ఆడి 11,363 పరుగులు చేయగా.. 113 టెస్టుల్లో 7,212 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కుని సమస్యల్లో ఉన్న జట్టుని తన అద్భుత నాయకత్వంతో మళ్లీ గాడిలో పెట్టాడు. కాగా ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫ్రాంచైజీ ఏటీకే తదుపరి సీజన్ ‌కోసం మోహన్‌ బగాన్‌తో చేతులు కలుపగా.. ఆ జట్టు డైరెక్టర్లలో ఒకడిగా గంగూలీ వ్యవహరించనున్నాడు.

క్వింటన్ డికాక్‌కు అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన చోటు!!

Story first published: Monday, July 6, 2020, 8:29 [IST]
Other articles published on Jul 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X