న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని ఎక్కడ నుంచి పట్టుకొచ్చావ్?: ముషారఫ్‌ ప్రశ్నకు గంగూలీ జవాబు ఇదీ

Sourav Ganguly Reveals Hilarious Conversation With Musharraf Regarding Dhoni
 Sourav Gangulys reply to Pervez Musharrafs Where did you get MS Dhoni from? question is hilarious

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐసీసీ నిర్వహించే మూడు ట్రోఫీలను భారత్‌కు అందించిన ఏకైక భారత కెప్టెన్. 2007‌లో టీ20 ప్రపంచకప్.. 2011లో వన్డే ప్రపంచకప్‌ని భారత్‌కి అందించి విజయవంతమైన కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు.

<strong>నీ హద్దులు దాటడానికి ప్రయత్నించొద్దు: యాంకర్‌కు పాక్ క్రికెటర్ వార్నింగ్</strong>నీ హద్దులు దాటడానికి ప్రయత్నించొద్దు: యాంకర్‌కు పాక్ క్రికెటర్ వార్నింగ్

అలాంటి ధోని తన కెరీర్ ఆరంభంలో జులపాల జుట్టుతో అభిమానులతో పాటు పాకిస్థాన్ అధ్యక్షుడుని సైతం ఆకర్షించాడు. ఈ విషయాన్ని తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. 2006లో పాకిస్థాన్ పర్యటనకి టీమిండియా వెళ్లిన సంగతి తెలిసిందే.

46 బంతుల్లోనే 72 పరుగులు చేసిన ధోని

46 బంతుల్లోనే 72 పరుగులు చేసిన ధోని

ఈ పర్యటనలో భాగంగా జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 288 పరుగులు చేసింది. అనంతరం 289 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు.. ధోని 46 బంతుల్లోనే 72 పరుగులు చేయడంతో అలవోక విజయాన్ని అందుకుంది.

భారత్-పాక్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించిన ముషారఫ్

ఆ మ్యాచ్‌ని అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ధోనిని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు' లభించింది. ఈ అవార్డుని ధోనికి అందజేసే సమయంలో ముషారఫ్‌ మాట్లాడుతూ "స్టేడియంలోని చాలా మంది ధోనీ హెయిర్ కట్ చేసుకోవాల్సిందిగా ప్లకార్డ్‌లు ప్రదర్శించారు. ధోనీకి నా సలహా ఏంటంటే? ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. హెయిర్ కట్ చేయించుకోకు" అని సరదాగా వ్యాఖ్యానించాడు.

ధోని ఆటతీరుకు ముగ్ధుడైన ముషారఫ్

ధోని ఆటతీరుకు ముగ్ధుడైన ముషారఫ్

ఆ మ్యాచ్‌లో ధోని ఆటతీరుకు ముగ్ధుడైన ముషారఫ్ గంగూలీని ఓ సరదా ప్రశ్న అడిగాడట. ఈ విషయాన్ని తాజాగా గంగూలీ వెల్లడించాడు. "పర్వేజ్‌ ముషారఫ్‌ ఆరోజు ధోనీ గురించి అడిగిన ప్రశ్న నాకు ఇప్పటికీ గుర్తుంది. సరదాగా మాట్లాడుతూ.. ధోనీని ఎక్కడ నుంచి పట్టుకొచ్చావ్..? అని అడిగారు. దానికి నేను.. వాఘా సరిహద్దులో నడుస్తుంటే మేము అతడ్ని మా దేశంలోకి లాగేశాం" అని సరదాగా బదులిచ్చానని గంగూలీ తెలిపాడు.

2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో

2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో

గంగూలీ నాయకత్వంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ధోనీ అరంగేట్రం చేశాడు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధోని తొలి మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. తన తొలి మ్యాచ్‌లో విఫలమైనా... ధోనిపై నమ్మకం ఉంచిన గంగూలీ, మద్దతుగా నిలవడంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ ముందుకు పంపించాడు. ఆ తర్వాత ధోని టీమిండియా కెప్టెన్‌గా రాణించడంతో పాటు భారత జట్టు అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 26, 2018, 16:47 [IST]
Other articles published on Nov 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X