న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంగూలీ ఇంట్లో కరోనా కలకలం.. మరో ఇద్దరికి పాజిటివ్!!

Sourav Ganguly’s Brother Test Positive For Coronavirus

కోల్‌కతా: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మరింత వేగవంతం కానుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం ప్రకటించింది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్‌లో వైరస్ పంజా విసరనుందని పేర్కొంది. మరోవైపు భారత్‌లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం ప్రాణాంతక వైరస్ బారిన పడుతున్నారు. భారత్‌లో ఇప్పటికే 3,95,048 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

భారత శిక్షణ శిబిరానికి ఎంఎస్ ధోనీ?!!భారత శిక్షణ శిబిరానికి ఎంఎస్ ధోనీ?!!

గంగూలీ సోదరుడికి పాజిటివ్:

గంగూలీ సోదరుడికి పాజిటివ్:

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్లో కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టించింది. తాజాగా దాదా కుటుంబ సభ్యుల్లోని మరో ఇద్దరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గంగూలీ సోదరుడు, మాజీ రంజీ క్రికెటర్‌ స్నేహశీష్కు‌ కరోనా పాజిటివ్ అని తేలింది. స్నేహాశిష్ భార్యకు కూడా పాజిటివ్ వచ్చింది. స్నేహాశిష్ రంజీ ట్రోఫీ ఆటగాడు. ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో సౌరవ్ గంగూలీ తన సోదరుడితో పాటు బెంగాల్ తరఫున ఆడాడు.

స్నేహాశిష్‌ అత్తమామలు కూడా:

స్నేహాశిష్‌ అత్తమామలు కూడా:

స్నేహాశిష్‌ ఇంట్లో పనిచేసే వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే స్నేహాశిష్‌ అత్తమామలు కూడా వైరస్ బారినపడ్డారు. వీరందరూ ప్రస్తుతం చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉన్నారు. బెంగాల్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి పీటీఐతో మాట్లాడుతూ... 'దాదా కుటుంబంలోని నలుగురు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఫిర్యాదు చేసారు. టెస్టుల్లో వారికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారు ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంటికి ఎప్పుడు పంపిస్తామనేది.. చికిత్సకు వారు ఎలా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. స్నేహాశిష్‌ కుటుంబం బెహాలాలోని గంగూలీ యొక్క పూర్వీకుల ఇంట్లో ఉండడం లేదు' అని తెలిపారు.

అఫ్రిది పాజిటివ్:

అఫ్రిది పాజిటివ్:

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది గతవారం కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. తాను మహమ్మారి నుంచి కోలుకుంటున్నట్లు తాజాగా అఫ్రిది తెలిపాడు. ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియో షేర్ చేసిన అఫ్రిది.. అసత్య వార్తలను నమ్మవద్దని, తన గురించి భయపడాల్సిన అవసరంలేదని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇక పశ్చిమ బెంగాల్‌ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,090 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో మహమ్మారితో పోరాడుతూ 7,303 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 529 మంది మరణించారు.

Story first published: Saturday, June 20, 2020, 16:27 [IST]
Other articles published on Jun 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X