న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమిత్ షా కొడుకు అయితే ఏంటి?: బీసీసీఐ కార్యదర్శి జై షాతో కలిసి పని చేయడంపై దాదా

Sourav Ganguly opens up on fantastic working relations with BCCI secretary Jay Shah

హైదరాబాద్: ఇటీవలే కొత్తగా బోర్డు కార్యదర్శిగా నియమించబడ్డ జై షాపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. దేశంలోనే అత్యంత 'శక్తివంతమైన వ్యక్తులు' క్రికెట్ పరిపాలనలో భాగం కావడంలో తప్పు లేదని సౌరవ్ గంగూలీ తెలిపాడు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షాను బీసీసీఐ కార్యదర్శిగా నియమించడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై శుక్రవారం ఇండియా టుడే కాన్‌క్లేవ్ ఈస్ట్ 2019లో సౌరవ్ గంగూలీని అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

బుమ్రా బర్త్‌డే: అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై ముంబై ఇండియన్స్ ఫన్నీ ట్వీట్బుమ్రా బర్త్‌డే: అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై ముంబై ఇండియన్స్ ఫన్నీ ట్వీట్

శక్తివంతమైన వ్యక్తుల కుమారులు లేదా కుమార్తెలు తమంతట తాముగా స్వతంత్రంగా ఎదగడంపై వస్తోన్న విమర్శలపై తాను నిరాశ చెందానని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇందుకు ఉదాహరణగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను చూపించాడు.

గంగూలీ మాట్లాడుతూ

గంగూలీ మాట్లాడుతూ

గంగూలీ మాట్లాడుతూ "ఈ విషయం మీకు తెలుసు భారతదేశంలో చాలా శక్తివంతమైన వ్యక్తి యొక్క కుమారుడు లేదా కుమార్తె అయితే కొన్ని విషయాల్లో మీరు పాల్గొనలేరు. సచిన్ విషయాన్నే పరిగణనలోకి తీసుకుంటే, తన కుమారుడిని సచిన్ టెండూల్కర్‌గా కాకుండా ఓ క్రికెటర్‌గా భావించమని ప్రజలకు చెబుతున్నాడు" అని అన్నాడు.

ఇంటిపేరు గురించి మరచిపోండి

ఇంటిపేరు గురించి మరచిపోండి

" అతని ఇంటిపేరు గురించి మరచిపోండి. అతను మంచివాడా చెడ్డవాడా అని చూడండి. సచిన్ టెండూల్కర్ కుమారుడు ఎందుకు క్రికెట్ ఆడటం మానేయాలి. ఎందుకంటే అతడు టెండూల్కర్ కుమారుడు కాబట్టి. ఈ విధంగా ఆస్ట్రేలియాలో జరగదు, ఇంగ్లాండ్‌లో జరగదు" అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.

మార్క్ వా, స్టీవ్ వా

మార్క్ వా, స్టీవ్ వా

"మార్క్ వా, స్టీవ్ వా ఆస్ట్రేలియా జట్టుకు ఆడారు. వాళ్లిద్దరూ అన్నదమ్ములు. ఇద్దరు 100కుపైగా టెస్టులు ఆడారు. టామ్ కర్రన్, శామ్ కర్రన్ ఇప్పటికీ ఇంగ్లాండ్‌కు ఆడుతున్నారు. నేను దీనిని ఒక సమస్యగా చూస్తున్నాను. ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా చూసిన తర్వాత తీర్పు చెప్పాలి" అని దాదా చెప్పుకొచ్చాడు.

నాకు కొడుకు లేడు

నాకు కొడుకు లేడు

"అదృష్టవశాత్తూ, నాకు కొడుకు లేడు. రాహుల్ ద్రవిడ్ కుమారులు క్రికెట్ ఆడాలనుకుంటే వారు క్రికెట్ ద్రవిడ్ కుమారులు. వారు కెఎస్‌సీఎ లీగ్‌లలో నిలకడగా ఆడి సెంచరీలు సాధించారు. వారు మంచి ప్రదర్శన చేస్తే రేపు భారతదేశం తరపున ఆడతారు" అని గంగూలీ అన్నాడు.

జై షా విషయంలో

జై షా విషయంలో

"ఇదే నేను జై షా విషయంలో చెప్పాలని అనుకుంటున్నా. అతను అమిత్ షా కొడుకు అయితే ఏంటి? ఆయన ఎన్నికల్లో గెలిచారు. జై షా గత 6-7 సంవత్సరాలుగా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌లో పాల్గొన్నాడు. అతను స్వయంగా ఉండటానికి అనుమతించాలి. అతని తండ్రి ఓ రాజకీయ నాయకుడు. అతను కాదు. అతన్ని స్వతంత్రంగా తీర్పు తీర్చాలని నేను భావిస్తున్నాను" అని గంగూలీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఒక నెల అయింది

ఒక నెల అయింది

"నేను అతనితో కలిసి పనిచేయడం ప్రారంభించి ఒక నెల అయింది. అతడి వద్ద సర్దుబాటు చేసుకునే గుణం ఉంది. అద్భుతమైనవాడు. భారత క్రికెట్ యొక్క మంచి కోసం పనిచేయాలని కోరుకుంటాడు" అని గంగూలీ చెప్పుకొచ్చాడు. సుప్రీంకోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) పదవీకాలం ముగిసిన తర్వాత ఈ ఏడాది అక్టోబర్‌లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

బోర్డు కార్యదర్శిగా జై షా

బోర్డు కార్యదర్శిగా జై షా

బోర్డు కార్యదర్శిగా జై షా ఎన్నికయ్యాడు. ఇక, బిసిసిఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ సింగ్ ధుమాల్‌ కోశాధికారిగా, కేరళ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయేష్ జార్జ్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇక, ఉత్తరాఖండ్‌కు చెందిన మహీమ్ వర్మ కొత్త ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

Story first published: Friday, December 6, 2019, 18:33 [IST]
Other articles published on Dec 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X