న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇన్‌స్టాలో పోస్ట్.. గంగూలీని ఆటపట్టించిన కుమార్తె!!

IND vs BAN,2nd Test : Sourav Ganguly Gets Trolled By Daughter Sana || Oneindia Telugu
vSourav Ganguly Engages In Funny Banter With Daughter Sana, Wins Over Internet


ముంబై: భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య చారిత్రక డే/నైట్‌ టెస్టు విజయవంతంగా ముగిసింది. ఈ టెస్టును బీసీసీఐ, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం విజయవంతంగా నిర్వహించాయి. పిచ్‌ను దగ్గర నుంచి ట్రోఫీ ప్రదానోత్సవం వరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్ని బాధ్యతలు తీసుకుని విజయవంతం చేశారు. అతిథులను కూడా గౌరవించారు. ఈ పోరులో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మూడో అంపైర్‌కు నోబాల్‌ బాధ్యతలు.. భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌ నుంచే ట్రయల్స్‌!!మూడో అంపైర్‌కు నోబాల్‌ బాధ్యతలు.. భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌ నుంచే ట్రయల్స్‌!!

సీరియస్‌ లుక్‌లో దాదా:

సీరియస్‌ లుక్‌లో దాదా:

పింక్‌ బాల్‌ టెస్టులో భాగంగా సౌరవ్‌ గంగూలీ, కూతురు సానా గంగూలీల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి ట్రోఫీ అందించేటప్పుడు దిగిన ఓ చిత్రాన్ని గంగూలీ ఇన్‌స్టాలో పంచుకున్నారు. అందులో గంగూలీ కాస్త సీరియస్‌ లుక్‌లో కనిపించడంతో.. ఆయన కుమార్తె సనా సరదాగా ట్రోల్‌ చేసింది. 'మీకు నచ్చనిది ఏంటి?' అని అడిగింది.

 గంగూలీని ట్రోల్‌ చేసిన సనా:

గంగూలీని ట్రోల్‌ చేసిన సనా:

దీనికి గంగూలీ ఫన్నీగా రిప్లే ఇచ్చాడు. 'నువ్వు.. నాపై అవిధేయత చూపిస్తున్నావా' అని గంగూలీ బదులిచ్చాడు. మళ్లీ దానికి సనా మరో కామెంట్‌ యాడ్‌ చేశారు. 'అది మీ నుంచే నేర్చుకుంటున్నా' అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేసింది. ఇన్‌స్టాలో తండ్రీకూతుళ్ల ఈ సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది.

వరుసగా ఏడో టెస్టు విజయం:

వరుసగా ఏడో టెస్టు విజయం:

విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వరుసగా ఏడో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా వైట్‌వాష్‌ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. మరోవైపు వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలతో సరికొత్త రికార్డును కూడా నెలకొల్పింది.

టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం:

టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం:

360 టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని టీమిండియా మరింత పట్టిష్టం చేసుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌లో భారత్‌ పర్యటించనుంది. ఆ టెస్టు సిరీస్‌లో భారత్‌కు అసలైన పరీక్ష ఎదురుకానుంది. మరోవైపు న్యూజిలాండ్‌ సైతం బలంగా ఉండటంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరుగనుంది.

Story first published: Tuesday, November 26, 2019, 11:49 [IST]
Other articles published on Nov 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X