న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ సిరిస్ వల్లే: గంగూలీ అభిప్రాయానికి మద్దతు పలికిన భజ్జీ

Sourav Ganguly Credits Ashes For Keeping Test Cricket Alive, Puts Onus On Others To Raise Their Standards

హైదరాబాద్: ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌ ఇంకా బతికే ఉందనే భావన కలుగుతోందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు వర్షం అడ్డు తగలడంతో తొలిరోజు ఆట సాధ్యపడలేదు.

ఆ తర్వాత ఉత్కంఠ భరితంగా సాగి చివరికు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఫలితం కోసం తీవ్రంగా కష్టపడ్డాయి. క్రికెట్ అభిమానులకు అసలైన టెస్టు మజాను పంచాయి. ముఖ్యంగా స్టీవ్ స్మిత్-జోఫ్రా ఆర్చర్‌ల మధ్య చోటు చేసుకున్న సంఘటన మైదానంలో కాసేపు ఉత్కంఠను రేకెత్తించింది.

<strong>యాషెస్‌ మూడో టెస్టుకూ అండర్సన్‌ దూరం.. మొయిన్‌ అలీకి నిరాశే!!</strong>యాషెస్‌ మూడో టెస్టుకూ అండర్సన్‌ దూరం.. మొయిన్‌ అలీకి నిరాశే!!

ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ 148.7 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తాకింది. దీంతో స్టీవ్ స్మిత్ మైదానంలో కుప్పకూలాడు. దీంతో మ్యాచ్‌ని వీక్షిస్తోన్న అభిమానులతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఒక్కసారిగా కంగారుపడ్డారు.

అనంతరం ఆసీస్ జట్టు ఫిజియో ప్రాథమిక చికిత్స అనంతరం స్టీవ్ స్మిత్ మెల్లగా రావడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్మిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అనతంరం 40 నిమిషాల తర్వాత తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత్‌కు ఇద్దరు కెప్టెన్‌లుదక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత్‌కు ఇద్దరు కెప్టెన్‌లు

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో తొలి టెస్టులో ఆసీస్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్టు అనంతరం గంగూలీ మిగతా దేశాలు తమ టెస్టు క్రికెట్‌ ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని సూచించాడు.

ఈ మేరకు తన ట్విట్టర్‌లో "యాషెస్ సిరిస్‌తో టెస్టు క్రికెట్‌ ఇంకా బతికే ఉందనే భావన కలుగుతోంది. మిగతా దేశాలు తమ టెస్టు క్రికెట్‌ ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలి" అంటూ గంగూలీ ట్వీట్ చేశాడు.



కాగా, గంగూలీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో "జట్లు బలంగా ఉంటేనే ప్రమాణాలను కొనసాగించవచ్చు. భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలతో పాటు న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌ దేశాలు మినహా ఏ జట్లు కూడా టెస్టుల్లో పోటీని ఇవ్వలేకపోతున్నాయి" అని ట్వీట్ చేశాడు.
Story first published: Tuesday, August 20, 2019, 12:26 [IST]
Other articles published on Aug 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X