న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజీనామా తర్వాత పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై తొలిసారి కపిల్ స్పందన

Some people are always negative in life: Kapil Dev slams conflict of interest rules

హైదరాబాద్: పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై తనకు నోటీసులు రావడంతో క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) చీఫ్‌ పదవికి ఇటీవలే ప్రపంచకప్ విజేత, భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై మాట్లాడాడు.

క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) చీఫ్‌ పదవిలో ఎలాంటి పరస్పర ప్రయోజనముందో తనకు తెలియట్లేదని... ఇదేమీ శాశ్వత పదవో, జీతం తెచ్చే ఉద్యోగమో కాదని అన్నారు. ఒకటి లేదా రెండు సమావేశాలకు హాజరయ్యే గౌరవప్రదమైన పదవిలో ప్రయోజనాలు ఏముంటాయని కపిల్ దేవ్ ప్రశ్నించారు.

అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, ఒలింపిక్స్‌లో జపాన్‌కు: ఒసాకా సంచలన నిర్ణయంఅమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, ఒలింపిక్స్‌లో జపాన్‌కు: ఒసాకా సంచలన నిర్ణయం

ఇక, ప్రస్తుతం టీమిండియాలోని పేసర్లు భారత క్రికెట్‌ ముఖ చిత్రాన్నే పూర్తిగా మార్చివేశారని కపిల్ అన్నారు. "ఇలాంటి పేస్‌ అటాక్‌ను గతంలో ఎప్పుడు చూడలేదు. ఇలా ఉంటుందని ఊహించలేదు. ఇదే అత్యుత్తమమని అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత నాలుగైదేళ్లుగా మన పేసర్లు భారత క్రికెట్‌ దశనే మార్చేశారు" అని అన్నాడు.

గత కొంతకాలంగా భారత జట్టు బుమ్రా, ఉమేశ్, షమీ, ఇషాంత్, దీపక్‌ చహర్, సైనీలతో పటిష్టంగా తయారైన సంగతి తెలిసిందే. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులో షమీ అసాధారణంగా బౌలింగ్‌ చేశాడని కపిల్ కొనియాడాడు. పెద్ద సంఖ్యలో మన పేసర్లు ప్రపంచ శ్రేణి బౌలర్లుగా ఎదుగుతున్న తీరు గర్వకారణంగా ఉందని కపిల్ అన్నాడు.

గత జులై నెలలో బీసీసీఐ కపిల్‌దేవ్‌, శాంత రంగస్వామి, అన్షుమాన్ గైక్వాడ్‌‌లతో కూడిన క్రికెట్‌ సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవలే టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రిని ఎంపిక చేసింది. అంతకుముందు భారత మహిళల జట్టుకు కోచ్‌ను కూడా ఎంపిక చేసింది.

'డుప్లెసిస్ వ్యూహాత్మక తప్పిదంవల్లే తొలిరోజు టీమిండియాకు ఆధిక్యం''డుప్లెసిస్ వ్యూహాత్మక తప్పిదంవల్లే తొలిరోజు టీమిండియాకు ఆధిక్యం'

అయితే, ఇటీవలే కపిల్‌దేవ్‌ సీఏసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)లో సభ్యులుగా ఉన్న అందరూ పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా బీసీసీఐ నైతిక విలువల అధికారి జస్టిస్‌ డీకే జైన్‌కు ఫిర్యాదు చేసాడు.

ఈ నేపథ్యంలో డీకే జైన్‌ అక్టోబర్‌ 10లోగా వివరణ ఇవ్వాలని సీఏసీకి నోటీసులు పంపడంతో ఈ కమిటీలోని అందరూ రాజీనామానా చేశారు. కపిల్‌దేవ్‌ వ్యాఖ్యాతగా, ఫ్లడ్‌లైట్ల సంస్థ అధిపతిగా, భారత క్రికెటర్ల సంఘం సభ్యుడి (ఐసీఏ)గా ఉన్నారు. గైక్వాడ్‌ సొంత అకాడమీతో పాటు బీసీసీఐ అఫిలియేషన్‌ కమిటీలో సభ్యులు. శాంత కూడా ఐసీఏ సభ్యురాలుగా ఉన్నారు.

Story first published: Friday, October 11, 2019, 10:25 [IST]
Other articles published on Oct 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X