న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Intresting:క్రికెట్‌లో అసాధ్యం అనుకున్న మూడు సాధ్యమైన కథలు..రాహుల్-అగార్కర్-గిల్‌క్రిస్ట్

 Some Cricket stories that were impossible but actually true-Check the list here

క్రికెట్‌ను జెంటిల్‌మెన్స్ గేమ్ అని అంటారు. ఇక భారత్‌లో అయితే క్రికెట్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అంతర్జాతీయ క్రికెట్‌లో కొన్ని మరుపురాని ఘట్టాలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి, ఎప్పటికీ గుర్తుండిపోయే ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ద్రావిడ్ హ్యాట్రిక్ సిక్స్‌లు

జెంటిల్‌మెన్స్ గేమ్‌లో నిజంగా జెంటిల్‌మెన్‌లా ఆడే ఆటగాళ్లలో ఒకరు టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్ బంతిని బౌండరీకి తరలించడంలో దిట్ట. చాలా స్టైలిష్‌గా బంతిని బౌండరీకి డ్రైవ్ చేస్తాడు. అయితే అదే బంతిని సిక్స్‌గా మలచలేడనేది ప్రధాన విమర్శ ఉండేది. అయితే ఆ విమర్శలకు చెక్ పెడుతూ ఓ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు ద్రావిడ్. ద్రావిడ్ క్రీజ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థులకు చెమటలే. గంటల తరబడి ఎంతో ఓపిగ్గా క్రీజులో ఉండే సామర్థ్యం ఒక్క ద్రావిడ్‌కే ఉందని విశ్లేషకులు చెబుతుంటారు. ఇక అసలు విషయానికొస్తే.. రాహుల్ ద్రావిడ్ తాను 2011లో టీమిండియా తరపున ఒకే ఒక టీట్వంటీ ఆడాడు. ఇంగ్లాండ్‌పై మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గ్రేట్‌ వాల్ చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన సమిత్ పటేల్‌కు ఏకంగా హ్యాట్రిక్ సిక్స్‌లు బాది చుక్కలు చూపించాడు. అయితే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ క్రికెట్ ప్రపంచమంతా రాహుల్ ద్రావిడ్ బాదిన ఆ హ్యాట్రిక్ సిక్స్‌ల గురించే చర్చించుకుంది.ఇక 2012లో రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అయ్యాడు

అజిత్ అగార్కర్ సెంచరీ

చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టి మంచి ప్రదర్శన ఇవ్వాలనేది ప్రతి ఒక్క క్రికెటర్ కల. అయితే లార్డ్స్‌లో చాలా తక్కువ మంది ఈ కలను నిజం చేసుకున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ సాధించని రికార్డు అంటూ లేదు. కానీ క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన లార్డ్స్‌లో మాత్రం ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే టీమిండియా ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ మాత్రం ఊహించని ఈ ఘనత సాధించాడు. 2002 జూలైలో ఇంగ్లాడ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు 568 పరుగుల టార్గెట్ భారత్‌ ముందుంచింది.అప్పటికే భారత్ 170/6 ఉన్న తరుణంలో వీవీఎస్ లక్ష్మణ్‌-అగార్కర్‌ల జోడి 126 పరుగులు చేసింది.ఇదే సమయంలో స్పెషల్ బ్యాట్స్‌మెన్ లక్ష్మణ్ 74 వ్యక్తిగత స్కోరువద్ద ఔటయ్యాడు. దీంతో అజిత్ అగార్కర్ బాధ్యాతాయుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ చేశాడు. 190 బంతుల్లో 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు

గిల్ క్రిస్ట్-స్క్వాష్ బాల్ స్టోరీ

గిల్ క్రిస్ట్-స్క్వాష్ బాల్ స్టోరీ

2007 వరల్డ్‌కప్‌ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆస్ట్రేలియా భావించింది. ఫైనల్స్‌లో శ్రీలంకతో తలపడుతుంది. అయితే ఈ గ్రాండ్ ఫైనల్‌లో ఆసీస్ విద్వంసకర బ్యాట్స్‌మెన్ ఆడం గిల్‌క్రిస్ట్ వేసిన ప్లాన్‌ను ఎవరూ ఊహించలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా... 281 పరుగులు చేసింది. ఇందులో గిల్‌క్రిస్ట్ 13 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో 149 పరుగులు చేశాడు. ఇక శ్రీలంక ఇన్నింగ్స్‌ సమయంలో వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ఇంప్లిమెంట్ అయ్యింది. దీంతో శ్రీలంక 53 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసీస్ వరల్డ్ కప్ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ఇన్నింగ్స్ తర్వాత 149 రన్స్‌ చేయడం వెనక సీక్రెట్ చెప్పాడు గిల్లీ. తన కోచ్ సలహా మేరకు ఎడమ చేతి గ్లవ్‌లో స్క్వాష్ బాల్ పెట్టుకున్నట్లు గిల్లీ చెప్పుకొచ్చాడు.ఇలా చేయడం ద్వారా తన ఎడమ చేయి కింది భాగం వేగంగా కదులుతుందని వెల్లడించాడు.స్క్వాష్‌బాల్‌కు ఎలాస్టిక్ గుణం ఉండటం వల్ల క్రికెట్ బంతి బ్యాట్‌కు తాకడానికి కొన్ని సెకన్ల ముందు స్క్వాష్ బాల్ కంప్రెస్ అయి ఎడమ చేతి కింది భాగం వేగంగా కదలడంలో సహాయం చేస్తుందని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.

ఇలా క్రికెట్‌లో కొన్ని ఘట్టాలు ఇప్పటికీ ఎప్పటికీ సంథింగ్ స్పెషల్‌గానే ఉండిపోయాయి.

Story first published: Thursday, December 15, 2022, 13:49 [IST]
Other articles published on Dec 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X