న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

60 బంతుల్లోనే సెంచరీ కొట్టేసిన మంధాన

Smriti Mandhana smashes 60-ball T20 hundred in England

హైదరాబాద్: కియా సూపర్‌ టీ20 లీగ్‌లో భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన జోరు కొనసాగుతోంది. అద్భుత ఫామ్‌లో ఉన్న స్మృతి (102) 61 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో సెంచరీ కొట్టేసింది. దాంతో శుక్రవారం లాన్స్‌షైర్‌ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టర్న్‌ స్టోర్మ్స్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన లాన్స్‌షైర్‌ 7 వికెట్లకు 153 పరుగులు చేసింది.

ఛేదనలో స్మృతి వీరవిహారం చేయడంతో వెస్టర్న్‌ స్ట్రోమ్స్‌ జట్టు 154 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. జట్టు 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. మరోవైపు లాన్స్‌షైర్‌ తరఫున ఆడుతున్న భారత టి20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (0) విఫలమైంది. అయితే శాటర్త్‌వైట్‌ (57 బంతుల్లో 85 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాటంతో లాన్స్‌షైర్‌ మోస్తరు స్కోరు చేసింది.

గత ఆదివారం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో వెస్ట్రన్‌ స్ట్రోమ్‌ తరపున బరిలోకి దిగిన మంధాన మహిళల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీ సాధించిన బ్యాట్స్ ఉమెన్‌గా చరిత్ర సృష్టించింది. ఆదివారం లాఫ్‌బారఫ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మంధాన 18 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీని నమోదు చేసింది.

తనదైన శైలిలో సిక్స్‌తో మంధాన హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం. దీంతో సోఫీ డివైన్‌(న్యూజిలాండ్‌)తో కలిసి మంధాన సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. మంధానతో పాటుగా మరో క్రికెటర్ హర్మన్ ప్రీత్ ఆడుతున్నప్పటికీ ఆమె కంటే దూకుడుగా బ్యాట్‌ను ఝుళిపిస్తున్న మంధాన అందరి మన్ననలు అందుకుంటోంది.

Story first published: Saturday, August 4, 2018, 12:46 [IST]
Other articles published on Aug 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X