చిన్నప్పట్నుంచి ఆ హీరో అంటే చచ్చేంత పిచ్చి: స్మృతి మంధాన

సాంగ్లీ (ముంబై): భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన క్రీజ్‌లో

ఉన్నప్పుడు దూకుడుగా బ్యాటింగ్‌ చేయడమే కాదు.. మైదానం బయట కూడా అంతే చురుగ్గా ఉంటుంది. ఇక సహచరురాలు జెమీమా రోడ్రిగ్స్‌ జత కలిసిందంటే అల్లరికి అంతే ఉండదు. భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో వీరిద్దరూ అందించే వినోదం ప్రత్యేకం. అయితే ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా ఆటగాళ్లంతా తమ ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో సరదాగా మాట్లాడుకుందామని అభిమానులకు స్మృతి పిలుపునిచ్చింది.

భారత్‌ యుద్ధ ఫలితం ఏప్రిల్‌ 14 తర్వాత కనిపిస్తుంది: సచిన్

అభిమానులతో స్మృతి ముచ్చట్లు:

అభిమానులతో స్మృతి ముచ్చట్లు:

ట్విట్టర్‌ వేదికగా 'ఆస్క్‌ స్మృతి' అంటూ సాగిన సంభాషణలో 23 ఏళ్ల ఈ లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ తన మనసు విప్పి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. మైదానంలో ఎలా ఉంటారు అని ఓ అభిమాని అడగ్గా... 'మైదానంలో దిగాక అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఇక బ్యాటింగ్‌ సమయంలో కూడా ఒకేసారి ప్రణాళిక రూపొందించుకోకుండా ఒక్కో బంతికి అనుగుణంగా నా ఆటతీరును మార్చుకుంటా' అని తెలిపింది.

ప్రపంచకప్‌ సాధించిన రోజే చిరస్మరణీయం:

ప్రపంచకప్‌ సాధించిన రోజే చిరస్మరణీయం:

ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరని ప్రశ్నించగా... 'అంతర్జాతీయ క్రికెట్‌లో నేను ఎంతో మంది బౌలర్లను ఎదుర్కొన్నా. వారిలో మరిజాన్‌ కాప్‌ (దక్షిణాఫ్రికా పేసర్‌) బౌలింగ్‌లో పరుగులు తీయడానికి చాలా కష్టపడ్డా' అని స్మృతి సమాధానం ఇచ్చింది. 'కెరీర్‌కు సంబంధించి భారత్‌ తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన రోజు నా కెరీర్‌లో మరచిపోలేనిది. అయితే చిరస్మరణీయ క్షణం మాత్రం ఇంకా రాలేదు. బహుశా భవిష్యత్తులో మేం ప్రపంచకప్‌ సాధించిన రోజు అది కావచ్చు' అని మరో ప్రశ్నకు జవాబిచ్చింది.

హృతిక్‌ రోషన్‌ అంటే పిచ్చి:

హృతిక్‌ రోషన్‌ అంటే పిచ్చి:

ఇష్టమైన అబ్బాయి ఎవరని అడిగితే.. 'చిన్నప్పట్నుంచి బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్‌ అంటే చచ్చేంత పిచ్చి అని స్మృతి చెప్పింది. ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిందా అని అడిగితే.. ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లాడతానని తెలిపింది. 'మీరెంతో అందంగా ఉంటారు కదా. మరి సినిమాల్లో కథానాయికగా నటిస్తారా' అని ఓ అభిమాని అడగ్గా... 'నేను నటిస్తే ఆ సినిమా చూసేందుకు ఎవ్వరూ థియేటర్లకు రారు. మీరు నా నుంచి అలాంటివి ఆశించకండి' అని ఆమె బదులిచ్చింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, April 4, 2020, 13:37 [IST]
Other articles published on Apr 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X